రాష్ట్రీయం

సిగ్నలింగ్ పనుల కారణంగా ఐదు పాసింజర్ రైళ్లు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: దక్షిణ రైల్వేలో జరుగుతున్న సిగ్నలింగ్ పనుల్లో భాగంగా అరక్కోణం వద్ద జరుగుతున్న ప్రీ నాన్ ఇంటర్‌లాకింగ్, నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా ఆ రూట్లో నడిచే ఐదు రైళ్లను మే 5, 6 తేదీల్లో రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అరక్కోణం-తిరుపతి, తిరుపతి-అరక్కోణం, అరక్కోణం-తిరుపతి, తిరుపతి-నెల్లూరు, నెల్లూరు-సూళ్లూరు పేట తిరిగే మెమూ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
జనసాధారణ్ ప్రత్యేక రైలు
ఈ నెల 22న కాకినాడ టౌన్-సికింద్రాబాద్ మధ్య వయా గుంటూరు మీదుగా జనసాధారణ్ ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే తెలిపింది. ఈ రైలు 22న సాయంత్రం 6.10 గంటలకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరుతుందని తెలిపింది.