రాష్ట్రీయం

బాలకృష్ణపై చర్యలు తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 21: ప్రధాని నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. రెడ్‌క్రాస్ అవార్డుల ప్రధానోత్సవానికి వచ్చిన గవర్నర్‌ను శనివారం కలిసిన బీజేపీ నేతలు ఉన్నతమైన పదవిలో ఉన్న ప్రధానిని వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా, తరిమితరిమి కొడతామంటూ హెచ్చరించే ధోరణిలో ప్రసంగించారని ఆరోపించారు. ప్రధానిని ఉద్దేశించి బాలకృష్ణ చేసిన ప్రసంగంలో పదజాలం పరిధులు దాటి అత్యంత జుగుప్సాకరంగా ఉందని పేర్కొన్నారు. బాలకృష్ణ తన పరిధిని అతిక్రమించి ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేస్తుండగా, వేదికపై ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం నిలువరించే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలకు సంబంధించి టీవీ, పత్రికా క్లిప్పింగులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. గవర్నర్‌ను కలిసిన వారిలో నగర బీజేపీ అధ్యక్షుడు ఎం నాగేంద్ర, కార్యవర్గ సభ్యుడు చెరువు రామకోటయ్య తదితరులు ఉన్నారు.

చిత్రం..ఎమ్మెల్యే బాలకృష్ణపై చర్యలు కోరుతూ గవర్నర్ నరసింహన్‌కు
వినతిపత్రం అందజేస్తున్న బీజేపీ నాయకులు