రాష్ట్రీయం

పేదల పెళ్లికి ‘పెద్ద’లవుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం: పవిత్ర పుణ్యక్షేత్రమైన సింహాచలంలో పెద్దలు కుదిర్చే సంప్రదాయ వివాహాలే కాదు కులాంతర, ఆదర్శ, ప్రేమ వివాహాలు కూడా భారీ సంఖ్యలో జరగడం అందరికీ తెలిసిన విషయమే. విశేష చరిత్ర కలిగిన వరాహ నారసింహుడు కొలువైవున్న సింహాచలం శనివారం మరో అరుదైన ప్రభుత్వ కార్యక్రమానికి వేదికగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘చంద్రన్న పెళ్లికానుక ’ను మంత్రి గంటా శ్రీనివాసరావు నూతన దంపతులకు పెళ్లి పీటల పైనే అందజేసారు. దేవస్థానం పుష్కరిణీ సత్రం ప్రాంగణంలో జరిగిన నందిని, హరీష్‌ల కులాంతర వివాహానికి భరోసా కల్పిస్తూ ప్రభుత్వం తరపున 75 వేల రూపాయలతో పాటు మంత్రి గంటా వ్యక్తిగతంగా 25 వేలు, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ 10 వేలు, గంటా నారాయణమ్మ మెమోరియల్ ట్రస్ట్ పేరున అడివివరం సహకార పరపతి సంఘం అధ్యక్షుడు కర్రి అప్పలస్వామి 5 వేలు అందజేసారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన ‘చంద్రన్న పెళ్లికానుక’కు సంబంధించి ఈ నెల 18నే ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. జీవో వచ్చిన మూడు రోజుల వ్యవధిలోనే సింహాచలేశుని సాక్షిగా జరిగిన కులాంతర వివాహానికి సంబంధించిన తొలి రిజిస్ట్రేషన్ జరిపి కానుకను అందించడం పట్ల మంత్రి ఆనందం వ్యక్తం చేసారు. బడుగు, బలహీన వర్గాలకు భరోసా కల్పించే ‘చంద్రన్న పెళ్లికానుక’ భవిష్యత్తులో చరిత్ర సృష్టిస్తుందని ఆయన అన్నారు. 2014లో పాదయాత్ర సందర్భంగా అనేక అనుభవాల నేపథ్యంలో రూపకల్పన చేసి ఈ పధకాన్ని మేనిపెస్టోలో పెట్టామన్నారు. మానవ జీవితంలో వివాహం ఎంతో మధురమైనదని ఆర్థిక ఇబ్బందులు, సామాజిక పరిస్థితుల కారణంగా అనేకమంది వివాహాల కోసం ఆందోళన చెందుతున్న సంఘటనలు అనేకం చూసుంటామని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో రూపొందించినదే ‘చంద్రన్న పెళ్లికానుక’ అని ఆయన వెల్లడించారు. దివ్యాంగులను చేసుకుంటే లక్ష రూపాయలు, ఎస్సీ, ఎస్టీ కులానికి చెందిన వారిని వేరే కులానికి చెందిన వారు వివాహం చేసుకుంటే 75 వేలు, ఎస్టీ, ఎస్సీల్లోనే వేరే శాఖల వారిని వివాహం చేసుకుంటే 50 వేలు, బిసీలు వేరే కులానికి చెందిన వారిని చేసుకున్నా 50 వేలు, బీసీల్లో వేరే శాఖ వారిని చేసుకుంటే 30 వేలు చొప్పున ‘ చంద్రన్న పెళ్లికానుక ’ ద్వారా ప్రభుత్వం సాయం అందిస్తుందని మంత్రి స్పష్టం చేసారు. ‘ కల్యాణ మిత్ర కమిటీ ’ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలసి ఉంటుందని మంత్రి చెప్పారు. దక్షణ నియోజవర్గం పరిధిలో నివాసముంటున్న నందిని, హరీష్‌ల దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో వర్థిల్లాలని మంత్రితో పాటుతో వివాహనానికి హృజరైన వారంత ఆకాంక్షించారు. కార్యక్రమంలో జేసీ 2 సిరి, డీఆర్‌డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

చిత్రం..వధూవరులకు చంద్రన్న పెళ్లి కానుక అందజేస్తున్న మంత్రి గంటా, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్