రాష్ట్రీయం

నెల్లూరులో బీజేపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 21: విజయవాడలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నెల్లూరులో శనివారం జిల్లా బిజెపీ నేతలు చేపట్టిన నిరసన ఇరు పార్టీల నడుమ ఘర్షకు దారితీసింది. నగరంలోని గాంధీబొమ్మ కూడలిలో బిజెపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మిడతల రమేష్ నేతృత్వంలో బిజెపీ నేతలు, కార్యకర్తలు బాలకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇదే సమయంలో అక్కడకు వచ్చిన టీడీపీ కార్యకర్తలు బిజెపీ నేతల చర్యలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకొని తోపులాటకు దారితీసింది. ఈ వివాదం తీవ్రరూపం దాల్చి ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఒక దశలో ఇరు వర్గాలను అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. ఈ ఘర్షణలో తొమ్మిది మంది బిజెపీ కార్యకర్తలకు స్వల్ప గాయాలైనాయి. బిజెపీ కార్యకర్తలపై దాడి విషయం తెలియడంతో ఆ పార్టీకి చెందిన నేతలు వారి అనుచరులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కూడా భారీగా బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ సంఘటనపై ఇరు పార్టీల నేతలు నెల్లూరు ఒకటో నగర పోలీస్‌స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అనుచరులు ఉద్దేశపూర్వకంగా దాడులకు దిగారని మిడతల రమేష్ ఆరోపించారు. అయితే తొలుత వారే తమ కార్యకర్తలపై దిగారని ప్రత్యారోపణలు చేశారు.