రాష్ట్రీయం

హోదాతోనే ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, ఏప్రిల్ 24: రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా రావాల్సిందేనని వైఎస్సార్సీ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా గన్నవరం మూడు బొమ్మల సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల అవినీతి పాలనపై సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. ప్రత్యేక హోదాను చంద్రబాబు నాయుడు ఖూనీ చేశారని ఆరోపించారు. వైసీపీ ఎంపీలు ఐదుగురు రాజీనామా చేసినప్పుడే టీడీపీకి చెందిన 20 మంది ఎంపీలు కూడా రాజీనామా చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేదన్నారు. అలా చేయకుండా చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు. చంద్రబాబు ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చిన విధంగా చూస్తే ప్రతి ఇంటికీ రూ. 96వేల నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉందన్నారు. బాబు వస్తే జాబు వస్తుందన్న ఎన్నికల నినాదం అమలకు నోచుకోలేదన్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ వారి నుండి ఓటుకు రూ. 5వేలు గుంజి ఓటు మాత్రం మనస్సాక్షిగా వేయాలని సూచించారు. విశ్వసనీయత కోల్పోయిన వారు పదవులకు రాజీనామా చేసి ఇంటికి వెళ్లడం మంచిదన్నారు. చంద్రబాబు విశ్వసనీయత లేని కొంగజపాలు, కుంటి దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. అబద్ధాలు చెప్పి, మోసాలు చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. మట్టి నుంచి మద్యం వరకు, బొగ్గు నుంచి కరెంట్ వరకు దేనినీ వదలటం లేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొడాలి నాని, మేకా ప్రతాప్ అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, సామినేని ఉదయభాను, వంగవీటి రాధాకృష్ణ, పార్టీ నేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.