రాష్ట్రీయం

ఫిబ్రవరిలో భగవద్రామానుజుల వారి విగ్రహావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 24: ప్రపంచమంతా కలిసి ఉండాలని చాటి చెప్పిన మహానుభావుడు భగవద్రామానుజులవారని దేవనాథ రామానుజ జీయరు స్వామి అన్నారు. మంగళవారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ వెయ్యేళ్లకు ముందు భిన్నాభిప్రాయాలతో ఉన్న సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి, సమసమాజ స్థాపనకు రామానుజుల వారు కృషి చేశారని అన్నారు. అయితే, మళ్లీ సమాజం గతి తప్పింది. గతతప్పిన సమాజాన్ని రామానుజుల వారి సిద్ధాంత బోధనల ద్వారా మళ్లీ ఒక్కటిగా చేయాలన్న సంకల్పంతో ఆయన సిద్ధాంతాలను పూర్తిగా అర్థం చేసుకున్న శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామి సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని చేస్తున్నారని చెప్పారు. రామానుజుల వారి సహస్త్రాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని షంషాబాద్‌లో 216 అడుగుల భగవద్రామానుజుల వారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని స్వామి తెలియచేశారు. ఇప్పటికే ఈ విగ్రహ నిర్మాణం దాదాపూ పూర్తయింది. ఈ విగ్రహ ప్రాంగణంలోనే వైష్ణవ సంప్రదాయాలతో ఉండే 108 దివ్య ఆలయాలను కూడా నిర్మిస్తున్నారని ఆయన చెప్పారు. ఇందులో 106 ఆలయాలను మాత్రమే భక్తులు చూడగలిగారని, ఇప్పటి వరకూ భక్తులెవ్వరు దర్శించలేని పాలకడలి, పరమపదము వైష్ణవాలయాల గురించి పురాణ, ఇతిహాసాల ద్వారా తెలుసుకుని ఆ రెండు ఆలయాలను కూడా అదే ప్రాంగణంలో నిర్మిస్తున్నట్టు స్వామి తెలియచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు శంషాబాద్‌లో విగ్రహ నిర్మాణంతో పాటు, స్ఫూర్తి కేంద్ర నిర్మాణం ప్రారంభమైంది. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో కూడా రామానుజుల వారి సిద్ధాంత వ్యాప్తికి చిన జీయరు స్వామి సంకల్పించారని ఆయన తెలియచేశారు. అందులో భాగంగానే విజయవాడ వద్ద ఉన్న సీతానగరంలోని విజయకీలాద్రి మీద 108 అడుగుల రామానుజుల వారి పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు దేవనాధ రామానుజ జీయరు స్వామి తెలియచేశారు. దీని నిర్మాణం క్రమ క్రమగా జరుగుతోంది. షంషాబాద్ ఆశ్రమం వద్ద 216 అడుగుల విగ్రహ నిర్మాణం పూర్తయింది. మొదట విగ్రహాన్ని ఆవిష్కరించి, ఆలయాలను మరోసారి ఆవిష్కరించుకోవాలని అనుకున్నాం. ఇది వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ కాబట్టి ఆవిష్కరణల కార్యక్రమాలను మూడు విడతల్లో చేయాలనుకున్నాం. నిధుల కొరత వలన కొంత స్ఫూర్తి కేంద్రం ఏర్పాటులో జాప్యం జరిగింది. అందువలన ప్రాజెక్ట్ మొత్తం పూర్తయిన తరువాతే ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించామని స్వామి తెలిపారు. పనులు కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో రామానుజుల వారి స్ఫూర్తి కేంద్రాన్ని ఆవిష్కరించాలని భావిస్తున్నామని స్వామి చెప్పారు. విళంబినామ సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్‌ను సమాజానికి అందించనున్నారని తెలిపారు. విళంబినామ సంవత్సరంలో శ్రీరామచంద్రుడు అవతరించాడు. కలియు వైకుంఠ స్వామి పద్మావతిని పరిణయమాడాడు. అందుకే ఈ సంవత్సరంలోనే ఈ ప్రాజెక్ట్‌ను ఆవిష్కరిస్తామని దేవనాథ రామానుజ జీయరు స్వామి తెలియచేశారు.