రాష్ట్రీయం

ఉత్తమ కలెక్టర్‌గా వివేక్‌యాదవ్ సీఎం చేతుల మీదుగా అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఏప్రిల్ 24: రాష్ట్రంలో ఉత్తమ కలెక్టర్‌గా వివేక్‌యాదవ్ అవార్డును దక్కించుకున్నారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా మండపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ప్రతీ ఏటా పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ సేవలందించిన వారికి అవార్డులను బహూకరిస్తున్న విషయం విధితమే. కాగా, 2017-18లో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం కింద కనె్వర్జెన్సీ నిధులతో అనేక పనులు చేపట్టి జిల్లాను ప్రగతిపథంలో నడిపించినందుకుగాను ఈ అవార్డు దక్కింది. ఉపాధి హామీ పధకం కింద గత ఆర్థిక సంవత్సరంలో రూ.553.88 కోట్లు ఖర్చుకాగా, అందులో రూ.311.80 కోట్లు వేతనాల కింద చెల్లించారు. 3.59 లక్షల కుటుంబాలకుగాను 5.93 లక్షల మంది వేతనదారులకు ఉపాధి కల్పించగలిగారు. ఉపాధి హామీ పధకం కింద 2.45 లక్షల పనిదినాలు కల్పించి రాష్ట్రంలో మొదటి స్థానం దక్కించుకోవడంలో కలెక్టర్ కృషి ఎంతో ఉంది. అలాగే ఎన్టీఆర్ జలసిరి కింద 1701 బోరుబావులకు సోలార్ పంపుసెట్లు కల్పించి జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్ కనె్వర్జెన్సీ నిధులతో జిల్లాలో పండ్ల తోటల పెంపకం, అవెన్యూ ప్లాంటేషన్, వాడవాడలా చంద్రన్నబాట సిసి రోడ్లు, అంగన్‌వాడీ భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, నర్సరీలు, ఊరూరా పశుగ్రాస క్షేత్రాల పెంపకం, పాఠశాలల ఆట స్థలాల అభివృద్ధి, శ్మశాన వాటికల అభివృద్ధి, చేప పిల్లల పెంపకం, మల్బరీ ప్లాంటేషన్ పనులు చేపట్టారు. గృహనిర్మాణంలో 90 రోజుల పని దినాలు కల్పించారు. ఈ విధంగా ఉపాధి హామీ, కనె్వర్జెన్సీ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టి అందరి మన్ననలు అందుకున్నారు.

చిత్రం..కలెక్టర్ వివేక్‌యాదవ్‌ను సత్కరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు