రాష్ట్రీయం

సైబర్ భద్రతపై విశాఖలో సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 24: సైబర్ భద్రత అంశంపై ఇటీవల కాలంలో చురుగ్గా మార్గదర్శనం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈనెల 27, 28 తేదీల్లో విశాఖలోని ఫిన్‌టెక్ వ్యాలీలో అంతర్జాతీయ సదస్సును నిర్వహించబోతున్నది. దీనికి సంబంధించి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిరోజూ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తూ సంబంధిత శాఖల అధికారులకు దిశా నిర్దేశనం చేస్తున్నారు. ప్రధానంగా ఈ సదస్సులో అంతర్జాతీయ మేధో సంపన్నులైన వ్యక్తుల ఆలోచనలను ఒక వేదిక పైకి తెచ్చి విజ్ఞాన ఖనిని సృష్టించేందుకు, సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు తగిన వ్యూహాలను రూపొందించి దేశాలను, సంస్థలను, వ్యక్తులను భవిష్యత్తులో పరిరక్షించేందుకు ప్రతిస్పందించాల్సిన తీరుతెన్నుల గురించి చర్చించనున్నారు. ఇందులో పలు ఏజెన్సీలు, మేధోవర్గంలో స్టార్టప్‌లు, కన్సల్టెన్సీలు, విద్యాసంస్థలు, సాంకేతిక సైబర్ సెక్యూర్టీ కంపెనీలకు చెందిన 300 మందికిపైగా ప్రతినిధులు పాల్గొంటారు. దీనికి సంబంధించి ఐటీ సలహాదారు జెఏ చౌదరి సెక్యూర్టీ డిసెషనింగ్ అండ్ ప్రొడక్ట్స్, మాస్టర్ కార్డ్ వైస్ ప్రెసిడెంట్ మిస్ రెబక్తా లెండింగ్‌హామ్, తదితరులు వ్యూహరచన చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అంతర్జాతీయ ఫిన్‌టెక్ ఆవిష్కరణల కూడలిగా అభివృద్ధి పర్చాలన్నది తమ ఆశయమన్నారు.