రాష్ట్రీయం

భక్తిప్రపత్తులతో సత్యసాయి ఆరాధనోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, ఏప్రిల్ 24: పుట్టపర్తి సత్యసాయి బాబా 8వ ఆరాధనోత్సవం మంగళవారం భక్తిప్రపత్తుల నడుమ జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ప్రశాంతి నిలయం చేరుకుని సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని ప్రణమిల్లారు. ఆధ్యాత్మిక గురువుగా ప్రేమ, శాంతి, సేవను బోధించి సేవలో ప్రత్యక్షంగా పాలుపంచుకుని ప్రపంచాన్ని ముందుకు నడిపిన సత్యసాయి మార్గాన్ని అందరూ అనుసరించాలని వక్తలు సూచించారు. ఈ సందర్భంగా సుమారు 50 వేల మందికి అన్న, వస్త్ర, ప్రసాద నారాయణ సేవ అందజేశారు. కార్యక్రమంలో సత్యసాయి ట్రస్టు సభ్యులు ఆర్‌జే రత్నాకర్, చక్రవర్తి, ప్రసాదరావు, మోహన్, నాగానంద, టీకేకే భగవతి, సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ కేవీఆర్ వర్మ, తెలంగాణ ఎమ్మెల్యే గీతారెడ్డి, చీఫ్ విప్ పల్లె రఘునాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.