రాష్ట్రీయం

ఏసిబి కష్టం వృథా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: అవినీతి ఉద్యోగుల ఆటకట్టించడానికి ఏసిబి అధికారులు చేస్తున్న శ్రమ వృథాగా మారుతోంది. ఉద్యోగులపై వచ్చే ఆరోపణలను నిశితంగా పరిశీలించి, అనేక రోజులు నిఘా పెట్టి, వారి వెనుకున్న అక్రమార్జనపై అధ్యయనం చేసి, పదుల సంఖ్యలో ఏసిబి సిబ్బంది దాడులు నిర్వహిస్తున్నారు. వీరి దాడుల్లో వేల కోట్ల రూపాయల అక్రమార్జన బయటపడుతోంది. కొంతమంది అధికారులైతే కేవలం అవినీతికి పాల్పడటమే కాకుండా, సంఘ విద్రోహశక్తులతో చేతులు కలిపిన దాఖలాలు కూడా ఉన్నాయి. విశాఖ జిల్లాలో చూస్తే గడచిన 10 సంవత్సరాల్లో ఏసిబి అధికారులు నమోదు చేసిన కేసుల్లో ఖాకీ యూనిఫారం వేసుకున్నవారే ఎక్కువ మంది ఉన్నారు. 2008 సంవత్సరంలో అప్పటి జిల్లా ఎస్పీపై ఏసిబి అధికారులు దాడులు జరిపితే, కళ్లు చెదిరే అక్రమాలు బయటపడ్డాయి. ఒక పోలీస్ ఉన్నతాధికారి రౌడీ షీటర్లతో ఎటువంటి సంబంధాలు పెట్టుకున్నారోనన్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది. కానీ ఇప్పటి వరకూ ఆ కేసు పూర్తి కాకపోవడం గమనార్హం. కొనే్నళ్ల కిందట విశాఖ జిల్లా కశింకోట ఎస్‌ఐగా పనిచేస్తున్నప్పుడు ఏసిబి అధికారుల చేతికి చేతికి చిక్కిన ఓ ఎస్‌ఐ మళ్లీ విధుల్లోకి చేరి తన అక్రమార్జనకు మరింత పదునుపెట్టి, మళ్లీ ఏసిబికి దొరకడం గమనార్హం. విశాఖ జిల్లాలో పనిచేస్తున్న ఎంతోమంది సిఐలు, ఎస్‌ఐలు ఏసిబికి దొరుకుతున్నారు. వారి అక్రమార్జన వందల కోట్లలోనే ఉంది. ఇటీవల మెరైన్ సిఐ ఆస్తులపై ఏసిబి అధికారులు దాడులు చేస్తే, కనీసం 25 కోట్ల రూపాయల అక్రమార్జన వెలుగు చూసింది. సదరు సిఐ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న వైనం కూడా వెలుగు చూసింది. పోలీస్ శాఖను మంచిపోయింది రవాణా శాఖ. ఇందులో కొందరు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు అక్రమార్జన అత్యంత దారుణంగా ఉంది. ఇటీవల విశాఖ నగరంలో ఏసిబికి చిక్కిన ఇద్దరు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ల ఆస్తులు చూస్తే కళ్లు తిరగాల్సిందే. విశాఖ జిల్లాలో భారీగా అక్రమార్కులు దొరుకుతున్నారు. వీరిలో శిక్ష అనుభవించిన వారు మాత్రం చాలా తక్కువ మందే. కేసు నమోదు చేసిన రెండు సంవత్సరాల్లో ఏసిబి అధికారులు సదరు నిందితునిపై చార్జిషీట్ దాఖలు చేయకపోతే, ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోవచ్చన్న నిబంధన ఉంది. చట్టంలోని ఈ లొసుగును అడ్డం పెట్టుకుని చాలా మంది మళ్లీ విధుల్లో చేరి, అక్రమార్జనను కొనసాగిస్తున్నారు. గడచిన 13 సంవత్సరాల్లో విశాఖ జిల్లాలో నమోదైన ఏసిబి కేసుల్లో ఇప్పటికీ 61 కేసులు విచారణ దశలోనే ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏసిబి అధికారులు ఎంతో శ్రమకోర్చి కేసులు నమోదు చేస్తుంటే, ఈ అక్రమార్కులు వారికున్న పలుకుబడిని ఉపయోగించి, కేసును నీరుకార్చే ప్రయత్నం చేస్తున్నారు.

నేటి నుండి యక్షగాన మహోత్సవాలు
కూచిపూడి, ఫిబ్రవరి 22: ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కూచిపూడి నాట్యాన్ని విశ్వనాటక రంగంలో అగ్రభాగాన నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. డి విజయభాస్కర్ అన్నారు. కూచిపూడి యక్షగాన మహోత్సవాల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు సోమవారం వచ్చిన ఆయన స్థానిక శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. మంగళవారం నుంచి జరిగే యక్షగాన మహోత్సవాల నిర్వహణకు కేంద్ర సంగీత నాటక అకాడమీ రూ.26లక్షలు మంజూరు చేయటం ముదావహమన్నారు. నాట్యారామ కమిటీ చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ 503 మంది కళాకారులు 13 యక్షగానాలు, రెండు కలాపాలు, రెండు నృత్య రూపకాలు ప్రదర్శించనున్నారని తెలిపారు. సంగీత నాటక అకాడమీకి చెందిన ఆచార్య మొదలి నాగభూషణ శర్మ, జొన్నలగడ్డ అనూరాధలతో పాటు 84 సంవత్సరాల వయోవృద్ధులు, కర్ణాటక, కూచిపూడి నాట్య సంగీత పరిశోధకులు భాగవతుల సీతారామశర్మ ప్రత్యేక ఆహ్వానితులుగా వస్తున్నారని ఆయన తెలిపారు. ప్రిన్సిపాల్ డా. వేదాంతం రామలింగశాస్ర్తీ పాల్గొన్నారు.
పోలీసుల దెబ్బలకు వ్యక్తి మృతి
మడకశిర, ఫిబ్రవరి 22: పేకాట ఆడుతున్నారన్న అనుమానంతో పోలీసులు కొట్టిన దెబ్బలకు ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో మృతుని బంధువులు ఆందోళనకు దిగడంతో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా మడకశిరలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మడకశిరకు చెందిన లక్ష్మీనారాయణ మరో వ్యక్తితో కలిసి పెళ్లిపత్రికలు పంచేందుకు కర్నాటకకు వెళ్లారు. ఆదివారం సాయంత్రం గుడిబండ, అమరాపురం ఎస్సైలు వెంకటస్వామి, శ్రీనివాసులు సిబ్బందితో కలిసి తనిఖీ నిర్వహిస్తుండగా వాహనంపై లక్ష్మీనారాయణ రావడంతో ఆపి సోదా చేశారు. శుభలేఖలు ఇచ్చి వస్తున్నామని చెప్పినా వినకుండా పేకాట ఆడేందుకు వెల్లి అబద్దాలు చెబుతారా అంటూ కానిస్టేబుళ్లు నాగరాజు, నరసింహమూర్తి దూషిస్తూ చితకబాదారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఇంటికి చేరుకుని ఛాతీలో నొప్పి ఉందని చెప్పి మందులు వేసుకున్నాడు. ఆసుపత్రికి తరలించేలోగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మృతుని బంధువులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ధర్నా చేపట్టారు. వీరికి పలువురు నాయకులు మద్దతు తెలిపారు.

కొత్త వ్యవసాయ లోకం!
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, ఫిబ్రవరి 22: సాంప్రదాయ పంటలకు భిన్నంగా గిరిజన, మెట్ట ప్రాంతాలలో ఖరీదైన పూల మొక్కలు, కూరగాయలను పండించేలా రైతులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. షేడ్‌నెట్, పాలీహౌస్‌లను నిర్మించి, వీటి ద్వారా పూలమొక్కలు, కూరగాయలను పెద్దఎత్తున సాగుచేయడానికి తూర్పు గోదావరి జిల్లాలోని మెట్ట, ఏజన్సీ ప్రాంతాలను ఎంపికచేస్తోంది. హైదరాబాద్, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఇప్పటికే షేడ్‌నెట్, పాలీహౌస్‌లను ఏర్పాటుచేశారు. ఇదే తరహాలో తూర్పు గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా షేడ్‌నెట్‌ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సిక్కిం, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, బెంగళూరు, మహారాష్ట్ర, పూణేలో రైతులు ఈ విధానం ద్వారా పూలు, కూరగాయల సాగు చేపట్టి భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. ఆ రాష్ట్రాల తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా షేడ్‌నెట్, పాలీహౌస్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకువచ్చింది. ఏజన్సీ, మెట్ట ప్రాంత మండలాలు అధికంగా ఉండటం, చాలాచోట్ల నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ఈ విధానాన్ని అందుబాటులోకి తెస్తే బహుళ ప్రయోజనాలుంటాయని అధికారులు చెప్పారు. వరి సాగుపైనే ఆధారపడకుండా ఉద్యానవన సాగును రైతులు చేపడితే అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. ఇటీవల షేడ్‌నెట్, పాలీ హౌస్‌ల ఏర్పాటుపై రైతులకు కాకినాడలో ఒకరోజు ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. వీటి ఏర్పాటుకు ప్రభుత్వం 50 శాతం రాయితీ కల్పిస్తుండగా 40 శాతం బ్యాంకు రుణంగాను, మిగిలిన 10 శాతం లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. ఈ విధానం కింద టమోటా, కీరదోస, కాప్సికం వంటి కూరగాయలతో పాటు విలువైన పూల తోటల పెంపకానికి అనుకూలమైన వాతావరణం ఉన్నట్టు ఉద్యానవన నిపుణులు గుర్తించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

మాఘ పౌర్ణమి స్నానాలకు
పోటెత్తిన భక్తులు
అచ్యుతాపురం, ఫిబ్రవరి 22: విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలోని పూడిమడక, ఎస్ రాయవరం మండలం రేవుపోలవరం తీరాలు సోమవారం భక్తులతో పోటెత్తాయి. మాఘపౌర్ణమి సందర్భంగా ఆదివారం రాత్రి పూడిమడక తీరానికి చేరుకున్న వేలాది మంది భక్తులు జాగారం చేసి, సోమవారం తెల్లవారుజామునుంచి సముద్ర స్నానాలు ప్రారంభించారు. తీరంలోని మూడు దేవాలయాలను దర్శించుకున్నారు. సోమవారం కనీసం లక్ష మంది భక్తులు సముద్ర స్నానాలు చేసి ఉంటారని అంచనా. అదే విధంగా రేవుపోలవరం తీరంలో కూడా వేలాది మంది సముద్ర స్నానాలు చేశారు.