రాష్ట్రీయం

రామచంద్రారెడ్డి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పంచాయితీరాజ్ వ్యవస్థ బలోపేతం చేసిన తొలితరం నాయకుడు, మాజీ మంత్రి పి రామచంద్రారెడ్డి ఆదివారం కన్నుమూశారు. రెండు రోజుల క్రితం బాత్‌రూమ్‌లో జారిపడిన ఆయన ఎస్‌ఆర్ నగర్‌లోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన రామచంద్రారెడ్డి 1962లో తొలిసారి సంగారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆపై 1971, 1983, 1985, 1989 సంవత్సరాలలో ఎన్నికల్లో విజయం సాధించారు. చెన్నారెడ్డి, జనార్థన్‌రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్‌గా
సేవలందించారు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. రామచంద్రారెడ్డి మరణ వార్తను తెలుసుకున్న గవర్నర్ నర్సింహన్, సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, కాంగ్రెస్ పలువురు నేతలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రలో మంచి స్పీకర్‌గా, మంత్రిగా పనిచేసి ప్రజల మన్ననలు అందుకున్న ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో అధికారులు కుటుంబ సభ్యుల సూచించిన జూబ్లీహిల్స్ విస్పర్ వ్యాలీ సమీపంలోని స్మశానవాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు.

మాజీ మంత్రి పి రామచంద్రారెడ్డి ( ఫైల్‌పొటో )