రాష్ట్రీయం

అన్నివిధాలా ఆదుకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు/ రాజమహేంద్రవరం, మే 16: గోదావరి లాంచీ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల వంతున పరిహారం అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. బాధిత కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటామన్నారు. మంగళవారం సంభవించిన లాంచీ ప్రమాదం అత్యంత ఘోరమైనదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి వద్ద ప్రమాదం జరిగిన లాంచీనుంచి మృతదేహాల వెలికితీత, ఇతర సహాయక పునరావాస కార్యక్రమాలను బుధవారం స్వయంగా పరిశీలించారు. నాలుగు గంటలపాటు మకాంచేసి, అధికారులకు ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు చేశారు. మృతదేహాల వద్ద బంధువులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రమాదానికి గురైన లాంచీలో 44మంది ప్రయాణీకులున్నారని, 37మంది
తూర్పు, ఏడుగురు పశ్చిమగోదావరి జిల్లాకు చెందినవారన్నారు. మొత్తం 26మంది పురుషులు, 12మంది మహిళలున్నట్లు సమాచారం ఉందన్నారు. వీరిలో 22మంది సురక్షితంగా బయట పడ్డారన్నారు. 19 మృతదేహాలు లభ్యమయ్యాయని, మరో మూడు మృతదేహాల కోసం గాలిసున్నట్టు చెప్పారు. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందటం బాధాకరమన్నారు. మృతిచెందినవారిని తిరిగి తీసుకురాలేమని, కానీ మృత్యువాత పడినవారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ పదిలక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామన్నారు. తక్షణ సహాయం కింద లక్ష రూపాయలు అందిస్తామన్నారు. అలాగే మృతుల కుటుంబాలకు ఇళ్లు నిర్మిస్తామని, చదువుకున్నవారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, పిల్లలకు రెసిడెన్షినల్ పాఠశాలల్లో విద్య అందిస్తామన్నారు. ప్రమాదానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఇప్పటికే నిందితులు పోలీసులకు లొంగిపోయారన్నారు.
సంఘటన జరిగినట్లు తెల్సిన వెంటనే ఉభయగోదావరి జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని సీఎం తెలిపారు. మంగళవారం రాత్రి నుంచే ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఫైర్ సిబ్బంది గాలింపుచర్యలు చేపట్టినా పరిస్థితి అనుకూలంగా లేకపోవటంతో బుధవారం ఉదయం నుంచి గాలింపు చేపట్టామన్నారు. పోలవరం ప్రాజెక్టు బాధితులుగా ఆర్ అండ్ ఆర్ చెక్కుల కోసం బ్యాంకులకు వెళ్లటం తదితర పనుల నిమిత్తం గిరిజనులు లాంచీలో ప్రయాణిస్తున్న సమయంలో ఘోరసంఘటన చోటుచేసుకోవటం బాధకరమన్నారు. ఇక్కడ రోడ్లు కనీసం నడవడానికి కూడా వీలులేకుండా ఉన్నాయని, కమ్యూనికేషన్స్ వ్యవస్థను పటిష్టం చేయాల్సి ఉందన్నారు. గిరిజనులకు ఆర్‌అండ్‌ఆర్ సెంటరు అందుబాటులో ఏర్పాటు చేస్తామని, మొబైల్ టీంలు ఏర్పాటు, నిత్యావసర వస్తువులు గ్రామాల్లోనే అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకునేందుకు ప్రణాళిక తయారు చేయాలని ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించామన్నారు. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ధవళేశ్వరం నుంచి పోలవరం వరకు తాత్కాలికంగా భద్రతా చర్యలు తీసుకుంటామని, వెనువెంటనే శాశ్వత రక్షణ, భద్రతా చర్యలను అమలుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. సిమెంటు బస్తాలను కూడా వేయటం వల్ల ఒక్కసారిగా బరువు పెరిగిపోవటంతో లాంచీ మునిగిపోయిందన్నారు. ఘటనలో మానవతప్పిదంతోపాటు ప్రకృతి వైపరీత్యం కూడా ఉందన్నారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు, నక్కా ఆనంద్‌బాబు, రాజమండ్రి ఎంపి మాగంటి మురళీమోహన్, ఎమ్మెల్యేలు మొడియం శ్రీనివాసరావు, పంతం రాజేశ్వరి, గోరింట్ల బుచ్చయ్యచౌదరి, ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు డాక్టరు కాటంనేని భాస్కర్, కార్తికేయ మిశ్రా, ఎస్పీలు ఎం రవిప్రకాష్, విశాల్‌గున్నీ, తూర్పుగోదావరి జిల్లా జడ్పీ ఛైర్మన్ జ్యోతుల నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.