రాష్ట్రీయం

ఎం-పార్క్ పాలసీకి ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 16: ఉపాధి లక్ష్యంగా వివిధ నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటుకు వీలుగా ఎం-పార్క్ పాలసీ 2018-23ను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు ఏపీ ఎలక్ట్రిక్ మొబిలిటి పాలసీకి కూడా ఆమోద ముద్ర వేసింది. మున్సిపాలిటీలలో 12,600 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు పాలనామోదాన్ని తెలిపింది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం బుధవారం జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
ఎం-పార్క్ పాలసీలో భాగంగా 200 ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు లక్ష్యం. ఒక్కో పార్కులో రూ.225 కోట్ల పెట్టుబడి చొప్పున రూ.45 వేల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాల కల్పన సాధ్యం
ఏపీ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ కింద ఎలక్ట్రికల్ వాహనాల తయారీ, ఎడ్వాన్స్‌డ్ బ్యాటరీ, ఛార్జింగ్ పరికరాల తయారీకి ప్రోత్సాహకాలు ఇవ్వడం సాధ్యమవుతుంది. ఈ రంగంలో నెలకొన్న పోటీ వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకునేలా పాలసీ రూపకల్పన.
ఏపీ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ 2018కి ఆమోదం. ఇందులో భాగంగా బ్యాటరీ ఆధారంగా నడిచే ఈ-రిక్షాలు, ఈ-కార్ట్‌లు, నలుగురితో ప్రయాణించే ఆటోలకు జీవితపన్ను మినహాయింపు.
రాష్ట్రంలో 71 పట్టణాల్లో రూ.81 కోట్ల అంచనా వ్యయంతో 203 అన్న క్యాంటీన్ల ఏర్పాటు. క్యాటరింగ్ సేవలకు రూ.164 కోట్లు, నిర్వహణకు రూ.3కోట్లు
ఖర్చు కానుందని అంచనా. అల్పాహారం, భోజనం ఏదైనా రూ.5కే ఇవ్వాలి. అన్న క్యాంటిన్ల నిర్వహణకు కమిటీల ఏర్పాటు.
దారిద్య్ర రేఖకు దిగువనున్న రేషన్ కార్డుదారులకు కందిపప్పును నెలకు 2 కిలోల చొప్పున కిలో రూ.40కి విక్రయించేందుకు నిర్ణయం. ఇందుకు అవసరమైన రూ.131 కోట్ల రాయితీని పౌరసరఫరాల శాఖకు అందించనున్నారు.
టీటీడీలో పనిచేస్తున్న మిరాశీయేతర 32 మంది అర్చకుల సర్వీసు క్రమబద్ధీకరణ
రైతు సాధికార సంస్థ తీసుకునే రూ.1000 కోట్ల రుణాలకు ప్రభుత్వ గ్యారంటీ కొనసాగింపు
జీవిత ఖైదు అనుభవిస్తున్న 49 మంది ఖైదీలను గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేయనున్నారు. సత్ప్రవర్తన, నియమ నిబంధనలను అనుసరించి విడుదల చేస్తారు.
ఏపీ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రూ.1000 కోట్ల రుణాలకు ప్రభుత్వ హామీ. గ్రామాలకు, మండల కేంద్రాలకు, నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా నియోజకవర్గ కేంద్రాల మధ్య రహదారుల అభివృద్ధి, విస్తరణ, వంతెనల నిర్మాణానికి ఈ నిధులు ఉపయోగిస్తారు.
జలవనరుల శాఖలో 34 సూపర్ న్యూమరీ పోస్టుల ఏర్పాటు.
రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న 392 జూనియర్ అసిస్టెంట్ కేడర్ ఉద్యోగులను సీనియర్ కేడర్ పదోన్నతికి ఆమోదం.
మున్సిపాలిటీలలో రూ.12,600 కోట్లతో నీటి సరఫరా, మురుగునీటి పారుదల, మరుగుదొడ్ల నిర్వహణ, వర్షపు నీటి పారుదల, రహదారుల మరమ్మతు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చుచేసేందుకు పాలనా ఆమోదం.
కృష్ణపట్నం పోర్టు అభివృద్ధికోసం 1000 ఎకరాల వాటర్ బాడీ లాండ్ అప్పగించేందుకు నిర్ణయం.
అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచిలో డంపింగ్ యార్డ్ నిర్మాణానికి 129 ఎకరాల భూమి కేటాయింపు.
అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచిలో ట్రక్ టెర్మినల్, రైల్వే సైడింగ్ వెండర్స్ కోసం 402 ఎకరాల భూమి కేటాయింపు.