రాష్ట్రీయం

ఆత్మబంధువు కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లంతకుంట, మే 16: ‘రైతుబంధు’ పథకంతో యావత్ దేశం చూపు తెలంగాణ వైపుందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ మంత్రి కే. తారకరామారావు అన్నారు. బుధవారం సిరిసిల్ల రాజన్న జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా వ్యవసాయం పెట్టుబడికి డబ్బులు అందించి రైతులకు ఆత్మబంధువుగా సీఎం కేసీఆర్ నిలిచారన్నారు. తెలంగాణ విడిపోతే రాష్ట్రంలో చీకట్లు అలుముకుంటాయని, బతుకులన్నీ ఆగమవుతాయని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారని గుర్తు చేస్తూ, తెలంగాణ ఏర్పడిన ఆరు నెలలకే రాష్ట్రంలో విద్యుత్ కాంతులతో రాష్ట్రం వెలిగిపోయిందన్నారు. నాడు తొమ్మిది గంటల విద్యుత్ ఇవ్వడానికే సర్కారు మొగ్గలేస్తే, తెరాస ప్రభుత్వం 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తోందని, ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు
ఒకేసారి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామనుకున్న సీఎం, ఆర్బీఐ నిబంధనల అడ్డంకితో నాలుగు విడతలుగా రుణమాఫీ చేయాల్సి వచ్చిందన్నారు. 50ఏళ్ల కాంగ్రెస్, 17 ఏళ్ల తెలుగుదేశం అధికారంలో కేవలం నాలుగు లక్షల టన్నుల ధాన్యం నిలువ చేసే గోదాములు నిర్మించగా, రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్లలో రైతుల కోసం 24 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు నిలువ చేసే గోదాములు ఏర్పాటు చేసుకున్నామన్నారు. నిరంతరం ఇలాంటి మంచి పథకాలతో రైతులకు లబ్ధి చేకూరాలనే ఆలోచనలో ఉన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కొందరు నాయకులు కోడి గుడ్డుమీద ఈకలెత్తినట్లు విమర్శించి వారిని వారే చులకన చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో దేశంలోనే తెలంగాణను సస్యశ్యామలంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. పంట పెట్టుబడి ఇవ్వగానే రైతులను ప్రభుత్వం మర్చిపోదని, మరో మూడు పథకాలు సీఎం రైతులకోసం ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. స్థానిక వౌలిక వసతులు తీర్చడానికి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా కోటి రూపాయలతో మండల కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. జిల్లెల నుంచి ఇల్లంతకుంట, గాలిపెల్లి, పొత్తూరు వరకు రోడ్ల వెడల్పుకు సత్వరమే నిధులు వెచ్చించేటట్లు చూస్తానని హామీ ఇవ్వడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తదనంతరం రైతుబంధు చెక్కులను ఆయన పంపిణీ చేశారు.