రాష్ట్రీయం

సభలో దళిత కూలీ ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లంతకుంట, మే 16: ‘రైతుబంధు’ చెక్కుల పంపిణీ సభలో నిరుపేద దళిత కూలీ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనమైంది. భూ పంపిణీలో అన్యాయం తనకు జరుగుతుందని, మూడెకరాల భూమి ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఒగులాపూర్‌కు చెందిన ఇల్లందుల కిష్టయ్య మంత్రి సభలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న కిష్టయ్యను అధికారులు పీహెచ్‌సీకి తరలించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూపంపిణీ విధానంలో మూడెకరాల భూమి కొనుగోలు చేసి ఇవ్వాలని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతోనే జీవితంపై విరక్తి చెంది తన భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని బాధితుని భార్య భాగ్య పేర్కొంది. ఈ విషయంపై తహశీల్దార్‌ను వివరణ కోరగా ఒగులాపూర్ గ్రామంలో దళితులకు భూపంపిణీ స్కీం ఇంకా ప్రారంభం కాలేదని, ప్రారంభంకాగానే భూమి కొనుగోలు చేసి ఇస్తామని కిష్టయ్యకు వివరించినట్లు పేర్కొన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న కిష్టయ్యను మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు ఓరుగంటి ఆనంద్ చికిత్స చేయించి తిరిగి కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో కిష్టయ్య కోలుకుంటున్నట్లు సమాచారం.