రాష్ట్రీయం

ఇదిగో కొత్త పీఆర్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త వేతన సవరణ కమిషన్‌ను రెండు, మూడు రోజుల్లో ప్రకటించనున్నట్టు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. గతంలో మాదిరిగా వేతన సవరణ కమిషన్‌కు ఏక సభ్యునితో కాకుండా ఈసారి త్రిసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆగస్టు 15నాటికి ప్రభుత్వానికి నివేదిక సమర్పించేలా ఆదేశిస్తామన్నారు. ఆలోగా జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవిర్భావాన తాత్కాలిక భృతి ప్రకటించనున్నట్టు తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లపై మంత్రివర్గ ఉప సంఘం చేసిన సిఫారసులపై చర్చించి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించడానికి ప్రగతి భవన్‌లో బుధవారం ఆయా సంఘాల నాయకులు, అధికారులు, మంత్రులతో సీఎం సమావేశం నిర్వహించారు. అనంతరం సమావేశ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా నిలబెట్టడానికి ఉద్యోగులు, అధికారులు ఎంతో అంకితభావంతో పని చేస్తున్నారని, అలాంటప్పుడు వారి డిమాండ్లను నెరవేర్చడం ప్రభుత్వ కనీస బాధ్యత అన్నారు. రాష్ట్ర విభజన కారణంగా ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు కల్పించడంలో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. ఉద్యోగుల విభజన సమస్యలు దాదాపు అన్ని తీరిపోవడంతో ఇక బదిలీలు, పదోన్నతులకు శ్రీకారం
చుడుతున్నామన్నారు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులపై శాశ్వతంగా ఒక పారదర్శకమైన విధానం అవసరమన్నారు. దీనికి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించి విధానాన్ని రూపొందిస్తుందన్నారు. జూన్ 10, 15 తేదీలకల్లా బదిలీల ప్రక్రియ ముగించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో మాదిరిగా బదిలీల్లో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. ఎక్కడైనా తప్పు జరిగితె కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతీ ఉద్యోగికి పదోన్నతి ఎప్పుడు వస్తుందో తెలిసే విధంగా విధానాన్ని రూపొందిస్తామన్నారు. రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించాలని నిర్ణయించామని, దీనిపై ఉద్యోగ సంఘాల నాయకుడు దేవిప్రసాద్ నేతృత్వంలో ఒక కమిటీని వేస్తున్నామన్నారు. జోన్ల విధానం ఫైనల్ అయ్యాక ఆమోదం కోసం రాష్టప్రతికి పంపిస్తామన్నారు. కొత్త పెన్షన్ విధానం పట్ల ఉద్యోగులకు అనేక అనుమానాలు ఉన్నాయని, చాలా రాష్ట్రాల్లో కూడా ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉందన్నారు. అయితే ఇది తమ పరిధిలో లేకపోవడంతో రిటైర్డు అయిన ఉద్యోగికి గ్రాడ్యూటీ చెల్లిస్తామన్నారు. ఉద్యోగులకు గతంలో 3 ఏళ్ల సర్వీసు పూర్తి చేసాక పదోన్నతి కల్పిస్తుండగా, ఇక నుంచి దీనిని రెండు సంవత్సరాలకు కుదించినట్టు సిఎం తెలిపారు. ఎల్‌టిసి విధానంలో కూడా మార్పులు తీసుకొస్తున్నామన్నారు. రెండు, మూడు ఎల్‌టిసీలను ఒకే సారి వినియోగించుకునే విధంగా విధానాన్ని రూపొందిస్తామన్నారు. కారుణ్య నియామకాలు 10 రోజుల్లో జరిగే విధంగా ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు. ఇంటి అద్దె అలవెన్స్‌లు అన్ని చోట్ల ఒకేలా లేకపోవడంతో మారుమూల ప్రాంతాల్లో పని చేసే వారికి ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు ఇప్పటికే వేతనాలు పెంచామని, మరికొంత కాలం ఇలాగే పని చేస్తూ వెళితే అప్పుడు ఏమి చేయాలో ఆలోచిస్తామన్నారు.
ఆర్టీసి కార్మికులు సమ్మెకు వెళితే చేసేది ఏముండదు
ఆర్టీసి కార్మికుల సమ్మె నోటీసుపై సిఎం ఆగ్రహం వ్యక్తం చేసారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా 44 శాతం ఇచ్చామని, అయినప్పటికీ వారు సమ్మె నోటీసు ఇవ్వడం ఏమిటనీ సిఎం ప్రశ్నించారు. ఆర్టీసి ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిందని, సమ్మె చేయడం వల్ల అది ఇంకా కోలుకోలేని పరిస్థితిని తీసుకోస్తామంటే తాము చేసేది ఏముండదని సిఎం కేసీఆర్ స్పష్టం చేసారు. ఫెడరల్ ఫ్రంట్ 2019 నాటికి పూర్తి స్థాయి ఏజెండాతో ప్రజల ముందుకు వస్తుందన్నారు.