ఆంధ్రప్రదేశ్‌

రైతుబజార్లలో రూ.8కే కిలో ఉల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: మార్క్‌ఫెడ్ ద్వారా ప్రతిరోజు 100 మెట్రిక్ టన్నుల ఉల్లి రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయనున్నట్లు మార్కెటింగ్ శాఖ కమిషనర్ పి.మల్లికార్జునరావు తెలిపారు. నాణ్యమైన ఉల్లి కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేస్తామని తెలిపారు. కొనుగోళ్లు తక్షణమే ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలా కొనుగోలు చేసిన ఉల్లిని రైతు బజార్ల ద్వారా విశాఖపట్టణం, విజయవాడ ప్రాంతాల్లో అమ్మకాలు జరుపుతామన్నారు. ప్రతి రోజు 200 నుంచి 250 టన్నుల ఉల్లి కర్నూలు మార్కెట్ యార్డుకు చేరుకుంటుందన్నారు.
ప్రస్తుతం మార్కెట్ యార్డులు ద్వారా రైతుకు కిలోకు రూ.4.50పై నుంచి రూ.6 వరకు రేటు లభిస్తోందన్నారు. రైతుకు గిట్టుబాటు ధర లభించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు నాణ్యతను బట్టి రూ.6 నుంచి రూ.8 వరకు మార్కెటింగ్ శాఖ కొనుగోళ్లు ప్రారంభించిందన్నారు. రాష్ట్రంలో 80 శాతం మేర ఉల్లిపంట కర్నూలు జిల్లాలో పండుతుందన్నారు. అయితే, ఈ పంట చేతికొచ్చేసరికి గుజరాత్, మహారాష్టల్ర నుంచి ఉల్లి మన మార్కెట్లలోకి వచ్చిపడుతోందన్నారు. రైతుకు సరైన ధర రాకపోవడానికిదే కారణమన్నారు. ఇప్పటికింకా కర్నూలు జిల్లాలో 3 హెక్టార్ల ఉల్లి పంట మార్కెట్‌కి రావాల్సి ఉందన్నారు.