రాష్ట్రీయం

గాలింపు ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం: ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దుల్లో పోలవరం మండలం వాడపల్లి గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం సంభవించిన లాంచీ ప్రమాదానికి సంబంధించి గురువారం కూడా గాలింపు చర్యలు కొనసాగించారు. దీనితో మరో నాలుగు మృతదేహాలు లభించాయి. వీరిని కణుతుల చిరంజీవి (35), చిడుగూరి సుబ్బలక్ష్మి (22), కొండ్ల రాజారెడ్డి (65), నడిపూడి అక్కమ్మ (33) గా గుర్తించారు. దీనితో మొత్తం 19 మృతదేహాలు లభ్యమైనట్టు అధికారులు తెలిపారు. కాగా గల్లంతైన ఏసుబాబు అనే యువకుడి ఆచూకీ కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం సభ్యులు గోదావరి నదిలో గాలిస్తున్నారు. అలాగే నౌకాదళానికి చెందిన రెండు హెలికాఫ్టర్లు ప్రమాదం జరిగిన ప్రదేశానికి అయిదు కిలోమీటర్ల పరిధిలో మృతదేహం
కోసం గాలిస్తున్నాయి. గురువారం లభ్యమైన నాలుగు మృతదేహాలకు సంఘటనా ప్రాంతంలోనే పోస్టుమార్టం నిర్వహించి వారి బంధువులకు అప్పగించారు. కె.రామచంద్రపురం ఐటీడీఏ పీవో హరీంద్రప్రసాద్, పోలవరం డీఎస్పీ ఎటివి రవికుమార్, సీఐ ఎం రమేష్‌బాబు, తూర్పుగోదావరి జిల్లా జేసీ మల్లికార్జునరావు, రంపచోడవరం ఐటీడీఏ పీవో నిషాంత్‌కుమార్ సంఘటన జరిగిన ప్రదేశంలో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
కాగా గల్లంతైన ఏసుబాబు మృతదేహం గోదావరి నది ఒడ్డు అడుగున నాచు మొక్కల్లో చిక్కుకుందేమోననే అనుమానంతో హెలికాఫ్టర్ నదికి తక్కువ ఎత్తులో ఎగిరిస్తూ గాలించినా ఫలితంలేకపోయింది. అలాగే లాంచీ అడుగున ఇరుక్కుపోయి ఉండవచ్చుననే అనుమానంతో భారీ క్రేనును రప్పించి లాంచీని తిరగబెట్టి గాలించినా ఫలితంలేదు. అయితే ఒక దశలో ఏసుబాబు తాళ్లూరు గ్రామంలోనే ఉన్నట్లు సమాచారం వచ్చింది కానీ నిర్ధారణ కాలేదు. గురువారం సాయంత్రం చీకటి పడిన అనంతరం గాలింపు చర్యలు నిలిపివేశారు. ఏసుబాబు అనే వ్యక్తి ఆచూకీ లభ్యం అయ్యేవరకూ గాలింపు చర్యలు కొనసాగిస్తామని డీఎస్పీ రవికుమార్ తెలిపారు.

చిత్రం..గురువారం వెలికితీసిన నాలుగు మృతదేహాలు