రాష్ట్రీయం

అడుగడుగునా భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల: రాష్ట్ర ప్రజల్లో భవిష్యత్తు స్ఫూర్తిని రగిలిస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి చేబట్టిన ప్రజా సంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగో రోజైన గురువారం ఉత్సాహభరితంగా సాగింది.
దెందులూరు మండలంలో ప్రారంభమైన యాత్ర రాజా పంగిడిగూడెం మీదుగా ద్వారకాతిరుమల మండలంలోకి ప్రవేశించింది. అడుగడుగునా అంతులేని వెతలు..వ్యవసాయమందక ఆవేదనలో రైతులు.., సంక్షేమం దూరమై బతుకీడుస్తున్న నిరుపేదలకు..నేనున్నానని భరోసా ఇస్తూ ఈ ప్రజా సంకల్ప యాత్ర మండలంలోని పలు గ్రామాల్లో ముందుకు సాగింది. రాజా పంగిడిగూడెం, సూర్యచంద్రరావుపేట, గొల్లగూడెం, తిరుమలంపాలెం, పావులూరివారి గూడెం గ్రామాల్లో జరిగిన ఈ సంకల్ప యాత్ర లో ప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. చిరునవ్వుతో ఆడపడుచులను ఆశీర్వదిస్తూ, పిల్లలను, వృద్ధులను ముద్దాడుతూ, అన్ని వర్గాల ప్రజలకు భరోసానిస్తూ జగన్ ముందుకు సాగారు. పాదయాత్ర చేబట్టిన గ్రామాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. జగన్ ప్రజల నుంచి పలు సమస్యలపై వినతులు స్వీకరించారు. మండలంలోని సిహెచ్ పోతేపల్లిలోని గిరియమ్మ ఎత్తిపోతల పథకం పనులు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో సుమారు రూ.8కోట్లతో చేబట్టారని, ఆఖరి దశలో ఉన్న ఈ పనులను టీడీపీ ప్రభుత్వం నిలిపివేయడం వల్ల పూర్తికాలేదని పలువురు జగన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ పనులు పూర్తయితే ద్వారకాతిరుమల, కామవరపుకోట మండలాల్లోని 7 వేల ఎకరాలకు సాగునీరందుతుందని ఈ సందర్భంగా రైతులు జగన్‌కు తెలిపారు. దీనిపై తగు చర్యలు చేపడతామని జగన్ రైతులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. అనంతరం ముదిరాజ్ వర్గీయులు కొందరు జగన్‌ను కలిసి తమ సామాజిక వర్గానికి ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటుచేయాలని, అదే విధంగా బీసీ బీలో ఉన్న తమని ఏకు మార్పుచేయాలని విజ్ఞప్తి చేశారు.

చిత్రం..పాదయాత్రలో పాల్గొన్న జగన్