రాష్ట్రీయం

జరిగేది త్రిముఖ పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో త్రిముఖ పోటీయే జరుగుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఉత్తరాంధ్ర నుంచి ప్రజా పోరాట యాత్ర ప్రారంభించేందుకు సన్నాహక ఏర్పాట్లు చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ బుధవారం రాత్రి విశాఖ నగరానికి చేరుకున్నారు. గురువారం ఉదయం పార్టీ కోర్ కమిటీతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఆ తరువాత ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కర్ణాటకలో జరిగిన ఎన్నికలను ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికలతో అన్వయించుకోవచ్చా? అని ప్రశ్నించగా, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా, త్రిముఖ పోటీయే జరుగుతుందని అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా, చివరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీజేపీయేనని కొద్ది రోజుల కిందట కొంతమంది అధికారులు తనకు చెప్పారని పవన్ వెల్లడించారు. బీజేపీకి వాళ్ల విధానాలు వాళ్లకు ఉన్నాయి. అవి వేరే చెప్పనక్కర్లేదు. అవి మంచివా, చెడ్డవా? అని ప్రశ్నించేస్థాయిలో ఏ పార్టీ కూడా లేదు. ఎందుకంటే ఎవరి లోపాలు వారికి
ఉన్నాయి. దశాబ్దాల నుంచి ప్రజాస్వామ్య పద్ధతులను నీరుకార్చుతూ ఈ స్థితికి తీసుకువచ్చారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. వందల కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం సమంజసమా? అని ప్రశ్నించగా ఇది అన్ని చోట్లా జరుగుతోంది. గతంలో వైసీపీ ఎమ్మెల్యేలను టీపీపీ కొనలేదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు ఇష్టమొచ్చినట్టు హామీలు ఇచ్చి వాటిని ప్రభుత్వాలు నెరవేర్చడం లేదు. ముఖ్యంగా విభజన చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు కేంద్రం మొగ్గు చూపడం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ హామీలను సాధించుకోలేకపోయిందని అన్నారు. అందుకే ఈనెల 20వ తేదీ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రజా పోరాట యాత్ర ప్రారంభించనున్నామని పవన్ చెప్పారు. 1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమంలో అమరులైన వారికి నివాళులు అర్పించి, గంగ పూజ చేసి, ఇచ్ఛాపురం నుంచి ప్రజా పోరాట యాత్ర ప్రారంభిస్తామని చెప్పారు. స్పెషల్ కేటగిరి స్టేటస్, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి ఇలా హామీలకు ఏ పేరైనా పెట్టండి.. వాటిని నెరవేర్చలేదు. ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఎవ్వరూ సరైన రీతిలో స్పందించడం లేదు. విభజన హామీల విషయంలో దీనిపై జనసేన పూటకోమాట మాట్లాడకుండా, ఒకే మాటపై ఉందని పవన్ స్పష్టం చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం ప్రజలకే కానీ, నాయకులకు లేదని అన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యను బయటకు తీసుకువచ్చినప్పుడు కూడా దాన్ని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని పవన్ అన్నారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలను ఇలాగే వదిలేస్తే, మరోసారి రాష్ట్రం విడిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరిగిపోతాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ఉద్యమానికి పుట్టినిల్లయిన శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ పోరాట యాత్రను ప్రారంభిస్తున్నానని పవన్ చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో యువతతో నిరసన కవాతు నిర్వహించనున్నట్టు పవన్ వెల్లడించారు. అలాగే జిల్లాలో యాత్ర ముగిసిన సందర్భంలో లక్ష మందితో కవాతు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, జై ఆంధ్ర ఉద్యమంలోని ఆ అమరవీరుల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో స్మారక స్థూపాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. 1972లోని అప్పటి ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసిన తప్పులు, నిర్లక్ష్యానికి, అలసత్వానికి కొన్ని కోట్లాది మంది ప్రజలు బలైపోతున్నారని అన్నారు. రాజకీయ పార్టీలు హామీలను పక్కన పెట్టేస్తున్న ఈ తరుణంలో రాజకీయ జవాబుదారితనాన్ని తీసుకురావల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ యాత్రలో జనసేన పార్టీ మ్యానిఫెస్టో కమిటీ కూడా పాల్గొంటుందని ఆన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిశీలించి, అధ్యయనం చేస్తామని అన్నారు. ఈ యాత్ర 45 రోజులు సాగుతుందని పవన్ వెల్లడించారు. యాత్రలో ప్రజా సమస్యలను గుర్తించి, అధ్యయనం చేయడమే కాదు, వాటికి పరిష్కార మార్గాలను కూడా అనే్వషిస్తామని అన్నారు. ఈ యాత్రలో పాదయాత్ర, రోడ్ షోలు ఉంటాయని ఆయన చెప్పారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్