రాష్ట్రీయం

కరవుభత్యం పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు డీఏ (కరువు భత్యం) పెంచుతూ ఆర్థికశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు పెంచిన పెన్షనర్లకు కూడా వర్తిస్తుందని ఆర్థికశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. గత ఏడాది జూలై ఒకటి నుంచి పెంచిన డిఏను వర్తింప చేయడం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.350 కోట్ల భారం పడనున్నట్టు ఆర్థికశాఖ లెక్క కట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 24.104 శాతం డిఏ చెల్లిస్తుండగా ఇక నుంచి దీనిని 25.676 శాతానికి పెంచినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పెరిగిన డిఏ 1.572 శాతంగా పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు డిఏను పెంచినప్పటికీ ఇంకా రెండు డిఏలు పెండింగ్‌లో ఉన్నట్టు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన సిఎం వెంటనే ఒక డిఏను విడుదల చేయనున్నట్టు ప్రకటించగా, మరో విడత డిఏను రెండు నెలల తర్వాత విడుదల చేయనున్నట్టు సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మొదటి విడత డిఏను విడుదల చేస్తూ ఆర్థికశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.