రాష్ట్రీయం

దోషులను వదలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: వైద్య విద్య యుజి కోర్సులో క్రీడల కోటాలో నిర్వహించిన అడ్మిషన్లలో అక్రమాలు జరిగినట్టు తెలడంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ అంశంపై మరింత సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా గురువారం నాడు అవినీతి నిరోధక శాఖను ఆదేశించారు. అడ్మిషన్ల కుంభకోణానికి బాధ్యులైన దోషులను వదిలేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. స్పోర్ట్సు కోటా కింద సీట్ల కేటాయింపులో భారీ కుంభకోణం జరిగినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో స్పోర్ట్స్ కోటాలో ఎంబిబిఎస్ సీట్లు దక్కించుకున్నట్టు వచ్చిన ఆరోపణలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావువిచారణకు ఆదేశించారు. దర్యాప్తు బాధ్యతలను అవినీతి నిరోదకశాఖకు అప్పగించినట్టు గురువారం ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. స్పోర్ట్స్ కోటా ఏ విధంగా దుర్వినియోగం జరిగిందో విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిందిగా దర్యాప్తు సంస్థను సిఎం ఆదేశించారు. స్టోర్ట్స్ కోటాలో అక్రమాలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు సిఎం హెచ్చరించారు.
2017-18 విద్యాసంవత్సరానికి సంబంధించి వైద్య విద్య సీట్లకు ఉన్న భారీ గిరాకీని దృష్టిలో ఉంచుకుని అసలైన క్రీడాకారులను పక్కన పెట్టి నకిలీ సర్ట్ఫికేట్లతో వచ్చిన క్రీడాకారులకు అధిక వెయిటేజీ ఇచ్చి వారికి సీట్లు వచ్చేలా చూశారనే ఆరోపణలు గుప్పు మన్నాయి. తొలుత ఈ వ్యవహారాన్ని అధికారులు తేలికగా కొట్టిపారేసినా, తర్వాత సాక్ష్యాలతో కొంత మంది ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ కమిటీ ఫిబ్రవరి 24న ముఖ్యమంత్రికి ఇచ్చిన నివేదికలో అక్రమాలు జరిగినట్టు
నిర్ధారించింది. ఈ వ్యవహారంపై మరోమారు అధికారులతో చర్చించిన సీఎం అక్రమాల వెనుక లోగుట్టు ఏమిటో తేల్చాలని ఏసీబీని ఆదేశించించారు. తెలంగాణకు చెందిన విలువిద్య క్రీడాకారిణి ఇవాంజెలీన్ ఎంబిబిఎస్ అడ్మిషన్లకు పోటీపడగా, ఆమెను అధికారులు పక్కన పెట్టారు. విలువిద్యలో సీనియర్ నేషనల్స్‌లో ఆమె పాల్గొంటే ఆమెకు జూనియర్‌గా గుర్తించి పాయింట్లు వేయడంతో సీటు కోల్పోయింది. జీవో 8ప్రకారం చూసుకుంటే తనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని, కానీ అధికారులు జీవోకు తప్పుడు భాష్యం చెబుతున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. అధికారుల నిర్వాకంతో హైదరాబాద్ క్రీడాకారుడు భరత్, ఏపీకి చెందిన హర్షితారాజ్‌లు కూడా నష్టపోయారనే ఆరోపణలు రావడంతో పాటు క్రీడా ప్రాథికార సంస్థకు సైతం అనేక ఫిర్యాదులు వచ్చాయి. దాంతో పాటు పత్రికల్లో కథనాలు రావడంతో కదిలిని సిఎంఓ దర్యాప్తునకు ఆదేశించారు. దాంతో పాటు సమగ్ర విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్‌లో పారదర్శక విధానాన్ని పాటించేలా చూడాలని కోరుతూ ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ అప్పటి యువజన సర్వీసుల సంచాలకుడు బుర్రా వెంకటేశంకు లేఖ రాశారు. ఈ మొత్తం వ్యవహారంపై సీరియస్‌గా ఉన్న సీఎం మరోమారు పరిశీలన జరపాలని అధికారులను ఆదేశించారు.