రాష్ట్రీయం

కుర్చీపై కోరిక లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన కానీ, అత్యాశ కానీ తనకు ఏ కోశనా లేదని సిఎం తనయుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేసారు. మరో 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఆ లోగా రాజకీయాల నుంచి తామే రిటైర్ అవుతావేమోనన్నారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని గతంలో చేసిన ప్రకటనకు కట్టుబడే ఉన్నట్టు కేటిఆర్ పునరుద్ఘాటించారు. రాజకీయాల్లోకి వచ్చి పదేళ్లు గడిచిన సందర్భంగా సచివాలయంలో మీడియాతో కేటిఆర్ తన అంతరంగాన్ని పంచుకున్నారు. టిఆర్‌ఎస్‌లో నంబర్ టు ఎవరన్న దానికి తావేలేదన్నారు. మంత్రి హరీశ్‌రావుతో తనకేలాంటి విభేదాలు లేవన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా టిఆర్‌ఎస్‌కే పట్టం కడుతారన్నారు. ఎవరి మద్దతు అవసరం లేకుండానే తామే అధికారంలోకి వస్తామన్నారు. మరో ఆరేళ్లపాటు తమ ప్రభుత్వమే స్థిరంగా ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ నినాదం కేసీఆరేననీ, తెలంగాణ, టిఆర్‌ఎస్, కేసీఆర్ దీంట్లో దేన్ని వేరు చేసి చూడలేమన్నారు. తెలంగాణ ప్రజలే తమకు ముఖ్యమన్నారు. కాంగ్రెస్, బిజేపీలకు కేసీఆర్ కొరుకుడుపడటం లేదన్నారు. జాతీయ పార్టీలకు ఏరకంగానూ అవకాశం ఇవ్వడం లేదన్నారు. ఆంధ్రా-తెలంగాణ, హిందూ-ముస్లిం వీటిలో దేన్నీ ఆసరా చేసుకుని రెచ్చగొట్టడానికి ఆస్కారం లేదన్నారు. ఒకవేళ బిజేపీ మతపరంగా రాజకీయాలు చేద్దామనుకున్నా కేసీఆర్‌కు మించిన పెద్ద ధార్మికవాది ఎవరైనా ఉన్నారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక భూమిక పోషించబోతున్నారని అన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు, ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతుందని గుర్తించే కాంగ్రెస్ నేతలు కర్నాటక నుంచి తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తీసుకొచ్చారని కేటిఆర్
అన్నారు. గోవా, కర్నాటక, మిజోరం రాజకీయ పరిస్థితులను చూస్తుంటే బడితే ఉన్నోడిదే రాజ్యంగా కనిపిస్తుందన్నారు. పంట రుణ మాఫీ కంటే రైతుబంధు పథకానికి అనూహ్యమైన స్పందన లభిస్తోందన్నారు. తన పదేళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పథకాన్ని చూడలేదని, దీనికి మించిన సంతృప్తి కలిగించింది మరొటి లేదన్నారు. ప్రతీ ఊరిలో ఆర్నేళ్ల ముందే దసరా పండుగ వచ్చినంత సంబర పడుతున్నారన్నారు. పంట పెట్టుబడిని కౌలు రైతులకు ఇవ్వలేమన్నారు. ఇచ్చి ఉంటే ప్రభుత్వమే తమను అధికారికంగా గుర్తించిందని పట్టాదారులపై కౌలుదారులు కోర్టులకు వెళ్లే అవకాశం ఉండేదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతుబంధు పథకాల తర్వాత వలస వెళ్లిన వారు రాష్ట్రానికి తిరిగి వచ్చేస్తున్నారన్నారు. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి ప్రభావం వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గిందని, ఇవీ లేకపోతే ఆర్థిక పరిస్థితి మరింత బాగుండేదన్నారు. రాష్ట్రంలో ఓ వైపు నిశ్శబ్ద విప్లవం వీస్తుందని అంటూనే ఎన్నికలకు కాంగ్రెస్ భయపడుతుందన్నారు. అధికారం కోల్పోయామన్న నిరాశ, నిస్పృహతో కాంగ్రెస్ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గూబ గుయ్యుమనక తప్పదని కేటిఆర్ అన్నారు.