రాష్ట్రీయం

గెలుపు కాంగ్రెస్‌దే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే 18: సీఎం కేసీఆర్‌కు అహం పెరిగి కళ్లు నెత్తికెక్కాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మూడో విడత ప్రజా చైతన్య బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి వరంగల్ బహిరంగ సభలో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా విప్లవం వస్తుందని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనం వీస్తుందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని సీట్ల్లూ స్వీప్ చేస్తామన్నారు. తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్వాక్రాలను నిర్వీర్యం చేశారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని 6 లక్షల మహిళా సంఘాలకు లక్ష గ్రాంట్ ఇస్తామన్నారు. అంతే కాకుండా ప్రతి మహిళా సంఘానికి బ్యాంక్ నుండి 10 లక్షల రుణ సౌకర్యం కల్పించి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. అభయ హస్తం పథకాన్ని పునరుద్ధరించి వేయి రూపాయల పించన్ అందిస్తామన్నారు. ఎన్నికల ముందు మోసపూరిత హామీలిచ్చిన కేసీఆర్ ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. కేసీఆర్
అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 4 వేల మంది రైతులు చనిపోతే కనీసం పరామర్శించిన పాపాన పోలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని వ్యవసాయ పంటలకు మద్దతు ధర కల్పించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుండి 15 వందల చోప్పున బోనస్ అందజేస్తామన్నారు. చేనేత కార్మికులకు 200కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇంటి వద్దే బీడీలు చేస్తున్న కార్మికులకు పెన్షన్ వచ్చేలా కృషి చేస్తామన్నారు. కేసీఆర్ వరంగల్ ప్రజలను మోసం చేశాడని, సీఎంగా బాధ్యతలు చేపట్టిన మొదటి యేడాదే నాలుగు రోజులు వరంగల్ పర్యటించి డబుల్‌బెడ్ రూం ఇళ్లను నాలుగునెలలో కట్టిస్తానని, తానకు దావత్ ఇవ్వాలని కల్లిబొల్లి మాటలు చెప్పిన కేసీఆర్ ఇంతవరకు ఇక్కడ ఎన్ని ఇళ్లు నిర్మించారో చెప్పాలని ప్రశ్నించారు. గత నాలుగేళ్లుగా గుర్తుకురాని రైతులు ఎన్నికల ఏడాదిలోనే గుర్తుకొచ్చారా అంటూ ప్రశ్నించారు. రైతుబంధు పథకం ఎన్నికల గిమిక్కులో భాగమేనని ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు.

చిత్రం..భవిష్యత్ విజయానికి చిహ్నంగా అభిమానులు బహూకరించిన ఖడ్గాన్ని ఎత్తి చూపుతున్న ఉత్తమ్