రాష్ట్రీయం

స్థానిక ఎన్నికల కోసం ‘టీఈ పోల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 18: స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో పారదర్శకతకు పెద్దపీట వేసేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓటర్ చిట్టీలతో పాటు నామినేషన్ ప్రక్రియ వరకు అన్నింటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. ఇందుకోసం టీఈ (తెలంగాణ ఎలక్షన్) పోల్ వెబ్‌సైట్‌ను రూపొందించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఓటర్ల జాబితాను ఈ వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్ చేస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం రూపొందించిన ఈ వెబ్‌సైట్‌ను ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తొలిసారిగా ఈ వెబ్‌సైట్ ద్వారానే ఎన్నికల ప్రక్రియంతా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో దీనిని విజయవంతం చేయడం ద్వారా దేశంలోనే ఆదర్శంగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. వెబ్‌సైట్‌ను ఎలా వినియోగించుకోవాలనే దానిపై ప్రతి జిల్లా నుంచి ఇద్దరికి గత నెలలోనే హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వారు విడతల వారీగా ఎంపీడీఓలు, ఇతర సిబ్బందికి శిక్షణలిస్తున్నారు. ప్రతి మండలానికి ఒక ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ను కూడా కేటాయించారు. సంబంధిత మండలాభివృద్థి అధికారులు వార్డుల వారిగా ఓటర్ల జాబితాను గత నెల 30వ తేదీనే ఆన్‌లైన్‌లో ఉంచారు. క్షేత్రస్థాయిలో సర్వేలు, అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు ఈ నెల 8వ తేదీలోపు పూర్తికాగా 10 తేదీన అధికారులు తుది జాబితాను తిరిగి ఆన్‌లైన్‌లో ఉంచారు. గతంలో ఓటర్ల తుది జాబితాను తయారు చేసేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంతో అది సులువుగా మారింది. ఓటర్ స్లిప్పులు కూడా ఓటర్లు వెబ్‌సైట్ నుండి తీసుకునే వీలు కల్పించారు. కాగా ఎన్నికల విధుల్లో భాగస్వాములు కానున్న ఉద్యోగుల వివరాలను మండల స్థాయి ఎన్నికల అధికారులు ఇదే వెబ్‌సైట్‌లో పొందుపర్చి ఉన్నతాధికారుల నుంచి అనుమతులు తీసుకుంటారు.
దీంతో ఎన్నికల విధులు నిర్వహించనున్న ఉద్యోగి సెల్‌ఫోన్‌కు ఏ గ్రామంలో విధులు నిర్వహించాలో సమాచారం అందుతోంది. దాని ఆధారంగానే ఆయన తనకొచ్చిన సమాచారం ఆధారంగా ఉన్నతాధికారుల ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఎన్నికలకు సంబంధించిన అన్ని నివేదికలను ఇదే వెబ్‌సైట్ ద్వారా అప్‌లోడ్ చేయనుండటంతో మండల స్థాయి నుంచి రాష్టస్థ్రాయికి సమాచారం నిమిషాల వ్యవధిలోనే చేరనున్నది. కాగా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంతో పనిభారం తప్పిందని, సమస్యలు కూడా తగ్గాయని మండల స్థాయి అధికారులు చెప్పడం విశేషం.