రాష్ట్రీయం

ఏవోబీలో మావోయిస్ట్ ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు/సీలేరు, మే 18: విశాఖపట్నం జిల్లా, పాడేరు సమీపంలోని ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్ట్ మృతి చెందగా పలువురు మావోయిస్టులు తప్పించుకున్నారు. ఏవోబీలో గురువారం ఉదయం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకరమైన కాల్పులు జరగడం, మావోయిస్టులు చాకచక్యంగా తప్పించుకోవడం పాఠకులకు తెలిసిందే. అయితే, ఈ కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో పోలీసు బలగాలను భారీగా మోహరించి విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా గురువారం అర్ధరాత్రి సమయంలో పోలీసులకు జోడం గ్రామ సమీపాన అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఇరువర్గాల మధ్య మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకోగా మావోయిస్టు మృతి చెందాడు. మృతుడు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రామ్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు ఒడిశాలోని మల్కన్‌గిరికి తరలించారు. కాగా, గురువారం అర్ధరాత్రి జరిగిన ఎదురుకాల్పుల ఘటన స్థలంలో రెండు తుపాకీలు, కిట్ బ్యాగ్‌లు లభ్యమైనట్టు సమాచారం. పోలీసులు వీటిని స్వాధీనం చేసుకుని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఏవోబీలో ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య రెండుసార్లు ఎదురు కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతమంతా యుద్ధ వాతావరణం అలముకోవడంతో ఆదివాసీలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.