రాష్ట్రీయం

26 నుంచి హైదరాబాద్‌కు కొత్త రైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: ఇండోర్-లింగంపల్లి (హైదరాబాద్) మధ్య కొత్త రైలు హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపేందుకు రైల్వే శాఖ అనుమతి మంజూరు చేసింది. దీంతో ఈ నెల 26 నుంచి రైలును ప్రారంభించేందుకు రైల్వే సన్నాహాలు చేస్తోంది. ఎసి 3 టైర్‌తో బోగీలతో కూడి వారానికి ఒకసారి నడిచే విధంగా ఈ రైలును రెగ్యులర్ సర్వీస్‌గా ప్రారంభించబోతున్నారు. ఈ నెల 26న ఇండోర్‌నుంచి ఈ రైలు ప్రారంభించబడుతుండగా, లింగంపల్లి నుంచి 27న ప్రారంభమవుతుందని ద.మ.రైల్వే వర్గాలు తెలిపాయి. 26న ఇండోర్‌లో ఉదయం 7 గంటలకు కొత్త రైలు ప్రారంభం అవుతుండగా, తిరుగు ప్రయాణ రైలు 27వ తేదీ ఆదివారం రాత్రి 9.20 గంటలకు లింగంపల్లి నుంచి ప్రారంభమై బయలుదేరుతుందని స్పష్టం చేసింది. ఈ రైలు ఉజ్జయిని, రత్లాం, వడోదర, సూరత్, వాసాయ్‌రోడ్, పనే్వల్, పుణే, సోలాపూర్, గుల్భార్గా, వికారాబాద్ స్టేషన్ల మీదుగా నడుస్తుందని రైల్వే స్పష్టం చేసింది.