రాష్ట్రీయం

కాస్త ముందుగానే రుతుపవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: వేసవి తాపాన్ని తట్టుకోలేక తెగ సతమతం అవుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ తీపి కబురు తెలిపింది. ఈ ఏడు ఎండలకు ముందుగానే బ్రేక్ పడనుందని మండువేసవిలో చల్లటి వార్తను అందించింది. గతంలో కంటే కాస్త ముందుగానే దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని, 29న కేరళకు చేరుకొని జూన్ 1 నుంచి తొలకరి వర్షాలు మొదలు అవుతాయని వివరించింది. దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించిన 15 రోజుల్లోనే దేశంలోని సగం ప్రాంతాల్లో ఒక మొస్తారు నుంచి భారీ వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రిజర్వాయర్లు తిరిగి నీటితో కళకళలాడటానికి, రైతులు పండటలు పండించడానికి ఈ వర్షాలు ఎంతో కీలకం. దేశంలోని వ్యవసాయంలో సగానికిపైగా వర్షాలపై ఆదారపడి జరిగేదే. ప్రతి ఏడాది వర్షాల కోసం వేచి చూసే అన్నదాత వాతావరణ శాఖ ఇస్తున్న బరోసాతో దుక్కి పనులను మే చివరి వారంలో ప్రారంభించుకునే అవకాశం ఏర్పడింది. అయితే రుతుపనాలు ముందుగానే దేశంలోకి ప్రవేశిస్తున్నా ఈ సారి దేశంలో సాదారణ వర్షపాతమే నమోదు అవుతుందని గతంలో వాతావరణ శాఖ పేర్కొనడం విచారకరం.