రాష్ట్రీయం

ఇక గెలుపు పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే 19: అడ్డదారిన పీఠమెక్కేందుకు ప్రయత్నించిన బీజేపీ ఆటలను కాంగ్రెస్ సాగనివ్వలేదని, కర్నాటకలో కాంగ్రెస్ విజయం 2019లో అటు దేశంలోను, ఇటు రాష్ట్రంలోను కాంగ్రెస్ విజయానికి నాంది అని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. కర్నాటకలో అడ్డదారిన అధికారంలోకి రావాలని బీజేపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా విఫలమయ్యారని అన్నారు. మూడో విడత బస్సుయాత్రలో పాల్గొనేందుకు వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటకు వెళ్తూ హన్మకొండ హరిత హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నాటకలో కాంగ్రెస్, జేడీ(ఎస్) ఎమ్మెల్యేలను ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేసి అధికారంలోకి రావాలని బీజేపీ ఎన్నికుట్రలు పన్నిన అక్కడి ఎమ్మెల్యేలు ధీటుగా ఎదుర్కొని విజయం సాధించారన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం బలంగా ఉందని, అందుకే కర్నాటకలో కాంగ్రెస్, జేడీ(ఎస్) కూటమి అధికారంలోకి రాబోతుందన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కుట్రలకు ఇక నూకలు
చెల్లాయని, 2019లో కేంద్రంలో రాహుల్‌గాంధీ ప్రధాని కావడంతోపాటు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కర్నాటక గవర్నర్ కేంద్రం ఏజెంటుగా పని చేస్తున్నారని, కర్నాటకలో కాంగ్రెస్, జేడీ(ఎస్) కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కేంద్రం నుంచి గవర్నర్‌ను ప్రభావితం చేసి దొడ్డిదారిన అధికారం చేపట్టాలని బీజేపీ శతవిధాల ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కర్నాటకలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో సీఎల్‌పీ సమావేశం నిర్వహించుకోవడం తమకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. కర్నాటకలో తాజాగా జరిగిన పరిణామాలు, తిరిగి తమ కూటమి అధికారం చేపట్టే అవకాశం రావడంతో వారు వరంగల్‌లో సంబరాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా స్వీట్లు తినుపించుకున్నారు. సమావేశంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, టీపీసీసీ సభ్యుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి, అఖిల భారత మహిళా కాంగ్రెస్ నేత సీతక్క, మాజీ ఎంపీ డాక్టర్ విజయరామారావు, ఏఐసీసీ నేత బక్క జడ్సన్, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేం నరెందర్‌రెడ్డి, నాయకులు మేకల ఉపేందర్, పసునూరి మనోహర్ ఉన్నారు.

చిత్రం..కర్నాటక విజయంపై ఆనందంతో
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్రెడ్డికి స్వీట్లు తినిపిస్తున్న నర్సంపేట ఎమ్మెల్యే దొంతి