రాష్ట్రీయం

టీఎస్, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: రాష్ట్ర విభజన సందర్భంగా రోడ్డు రవాణా సంస్థలో నెలకొన్న పెండిం గ్ సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామని ఇరు సంస్థల మేనేజింగ్ డైరక్టర్లు పేర్కొన్నారు. శనివారం నాడిక్కడ బస్‌భవన్‌లో టీఎస్ ఆర్టీసీ ఎండీ జీవీ రమణారావు, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు భేటీ అయ్యారు. సం స్థలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలు, ఇతర విషయాలను వెంటనే పరిష్కరించుకుందామని చర్చించుకున్నారు. ఆస్తులు, ఇతర అంశాలపై చర్చించుకున్న అనంతరం ఇద్దరూ చర్చల పట్ల ఏకీభవించారు. ఇరు సంస్థల్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కలుసుకుని తమ పరిధిలో ఉన్న పెం డింగ్ సమస్యలు ఏమిటనే అంశంపై చర్చించుకోవాలని, ఆ తర్వాత ఇంకా అపరిష్కృతం కాని సమస్యలు ఉంటే పరిష్కరించుకునేందుకు మేనేజింగ్ డైరెక్టర్లు ముందుకు వస్తారని తెలిపారు. తొలుత బస్ భవన్‌కు వచ్చిన ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుకు టీఎస్ ఆర్టీసీ ఎండీ రమణారావు స్వా గతం పలికి ఆహ్వానించారు.