రాష్ట్రీయం

11 లెవెల్ క్రాసింగ్‌ల వద్ద సీసీ కెమెరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాపలా లేని రైల్వే లెవెల్ క్రాసింగ్‌లను ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మూసివేస్తామని ద.మ. రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. ఎంపిక చేసిన 11 లెవెల్ క్రాసింగ్‌ల వద్ద సీసీ కెమెరాల నిఘాను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. శనివారం ఢిల్లీ నుంచి రైల్వే బోర్డు చైర్మన్ అశ్వని లోహాని ‘రైల్వేలో భద్రతకు తొలి ప్రాధాన్యం’ అనే అంశంపై అన్ని జోనల్ జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా జీఎం యాదవ్ రైల్వే బోర్డు చైర్మన్‌కు వివరిస్తూ రైల్వేలో భద్రతకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను వివరించారు. సెప్టెంబర్ నాటికి జోన్ పరిధిలో ఉన్న మనిషి కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌లను మూసివేస్తామని చెప్పారు. అలాగే మనిషి కాపలా ఉన్న లెవెల్ క్రాసింగ్స్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు రైల్వే బోర్డు చైర్మన్ మాట్లాడుతూ యుద్ధప్రాతిపదికన మనిషి కాపలా లేని రైల్వే లెవెల్ క్రాసింగ్స్‌ను మూసివేయాలని అన్ని జోనల్ జీఎంలను ఆదేశించారు. ఈ విషయం లో తమ పరిధిలో ఉన్న సిబ్బందిలో చైతన్యం తీసుకురావాలని చెప్పారు. కార్యక్రమంలో ద.మ.రైల్వేలోని పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.