రాష్ట్రీయం

2019 జనవరి నాటికి ఓటు నమోదు చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైనరాబాద్, మే 19 వచ్చే జనవరి 4వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులు (పౌరులు) తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్ సూచించారు. ఓటు నమోదు కార్యక్రమాన్ని అధికారులు ప్రతిష్టంగా చేపట్టాలని ఆయన తెలిపారు. కొత్త ఓటు నమోదుతో పాటు ప్రస్తుతం ఓటర్లలిస్టులో తప్పులను సిరిదిద్దాలని ఆయన ఆదేశించారు. ఈ నెల 21 నుంచి జూన్ నెల 30వ తేదీ వరకు ఇంటింటా ఓటర్ల నమోదు కార్యక్రమంపై పరిశీలన చేయాలన్నారు. జూన్ 16వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు పోలింగ్ కేంద్రాలను పరిశీలన చేయాలన్నారు. జూలై 2వ తేదీ నుంచి ఓటర్లను చైతన్యం చేయడానికి అధికారులు విస్తత్రంగా ప్రచారం చేయాలన్నారు. ఓటర్ల నమోదు అంశాలపై పూర్తి స్థాయిలో నివేధికను తయారు చేయాలన్నారు. సెప్టెంబర్ నాటికి ఓటర్ల లిస్టును ఆయా కేంద్రాల్లో ఉంచడానికి సిద్ధం చేయాలాన్నరు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఓటర్ల నమోదులో తప్పలను దిద్దుబాటు చేయాలన్నారు. 2019 జనవరి 3వ తేదీ నాటికి ఓటర్ల లిస్టులను ముద్రనకు ఇవ్వాలని ఆ మరుసటి రోజు పూర్తి స్థాయిలో ఓటర్ల లిస్లును అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.