రాష్ట్రీయం

స్లయిడింగ్‌లోనూ ఫీజు రీయింబర్స్‌మెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: ఇంజనీరింగ్ కాలేజీల్లో రెండు దశల్లో కౌనె్సలింగ్‌ను ముగిస్తామని, ఇంకా సీట్లు మిగిలిపోతే ఆయా కాలేజీల్లోనే స్లయిడింగ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. కాలేజీల్లో స్లయిడింగ్ చేసుకున్న వారికి సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్ లభిస్తుందని అన్నారు. ఇంకో పక్క ఈసారి దోస్త్‌లో డిగ్రీ అడ్మిషన్లలో సీటు పొందిన వారు, ఎమ్సెట్‌లో వృత్తి విద్యా కోర్సుల్లో సీట్లు పొందిన వారు ఏదో ఒక సీటును వదులుకోవల్సి ఉంటుంది. గత నాలుగేళ్ల అనుభవం చూస్తే రెండింటిలోనూ సీట్లు పొంది, ఏ సీటునూ రద్దు చేసుకోకపోవడం వల్ల మరో విద్యార్థి సీటు పొందే అవకాశాన్ని కోల్పోతున్నారు. దీనిని గమనించిన అధికారులు రెండు నెట్‌వర్కులను అనుసంథానం చేయడంతో ఎవరు ఏ కోర్సులో చేరుతున్నారో ఇట్టే తెలిసిపోతుంది. దీంతో ఒక సీటును అనివార్యంగా వదులుకోవల్సి ఉంటుందని అధికారులు వివరించారు.
నార్మలైజేషన్‌లో మొదటిసారి ర్యాంకులు
నార్మలైజేషన్ పద్ధతిలో మొదటిసారి ర్యాంకులను కేటాయించారు.టాప్ ర్యాంకర్లను విశే్లషిస్తే ఇంజనీరింగ్ స్ట్రీంలో టాపర్ ఏవీపీ వంశీనాధ్‌కు ఎమ్సెట్‌లో 150.8790 మార్కులు రాగా, కంబైన్డ్ స్కోర్ 95.7245 వచ్చింది. ఇక రెండో ర్యాంకర్ గట్టు మైత్రేయకు ఎమ్సెట్ మార్కులు 152.8616, 3వ ర్యాంకర్ జి వినాయక శ్రీవర్థన్‌కు 149.9518, 4వ ర్యాంకర్ కేవీఆర్ హేమంత్ కుమార్ చోడిపిల్లికి 149.9848 , ఐదో ర్యాంకర్ సనికొమ్ము మదన్ మోహన్‌రెడ్డికి 148.9300, 6వ ర్యాంకర్ డి భరత్‌కు 148.5004, 7వ ర్యాంకర్ యాష్ గార్గ్‌కు 147.6165, 8వ ర్యాంకర్ కొండ్ర రిష్యంత్‌కు 147.3424, 9వ ర్యాంకర్ ఎం షేక్ వాజిద్‌కు 146.8961, 10వ ర్యాంకర్ గట్టు సాయి అభిషేక్‌కు 145.3556 మార్కులు ఎమ్సెట్‌లో వచ్చాయి. అగ్రికల్చర్ స్ట్రీంలో టాప్-10లో ఐదుగురు అమ్మాయిలు ఉండగా, ఇంజనీరింగ్ స్ట్రీంలో టాప్-10లో ఒక్క అమ్మాయి కూడా లేకపోవడం గమనార్హం.
*
మెడికల్ స్ట్రీంలో టాపర్లు
సాధించిన మార్కులు
*
ర్యాంకు పేరు మార్కులు
1 పెరిగిల నమ్రత 145.8843
2 సంజీవ కుమార్ రెడ్డి 143.5188
3 సామల శ్రీఆర్యన్ 141.9008
4 చీరుపల్లి సంజన 141.2312
5 ముక్తేవి జయసూర్య 141.0043
6 గంజికుంట శ్రీవాస్తవ 140.4500
7 కేటీడీఎస్‌ఎస్ విజిత్ 140.9507
8 ఎ. అనఘాలక్ష్మి 140.1245
9 పాకల శ్రీ చైతన్య 139.5143
10 వి సత్యశ్రీ సౌమ్య 137.4503