రాష్ట్రీయం

సాగును దెబ్బతీస్తున్న వాతావరణ మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వాతావరణంలో మార్పుల వల్ల వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటోందని, వాతావరణ మార్పులకు అడ్డుకట్టవేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైదరాబాద్‌లో బుధవారం ముగిసిన అంతర్జాతీయ సదస్సులో శాస్తవ్రేత్తలు అభిప్రాయపడ్డారు. శాస్తవ్రేత్తలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వశాఖలు, ప్రైవేటు సంస్థలు వ్యవసాయంపై వాతావరణ మార్పు, వాతావరణ ప్రభావం, అనుసరణ ఉపశమన వ్యూహాలు చర్చించడానికి గానూ రెండు రోజుల పాటు అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సును సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, కేంద్రీయ గ్రామీణాభివృద్ధి సంస్థ, పంచాయతీరాజ్ శాఖ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సదస్సులో ముఖ్యంగా రైతు నేపథ్యానికి ప్రతికూలంగా జరుగుతున్న నష్టాలు, ప్రకృతి వైపరీత్యాలు, దిగుబడి అనిశ్చితి, తగ్గిన వ్యవసాయ సాధ్యత, గిట్టుబాటు ధరలు, అంతరించిపోతున్న జీవనోపాధి గురించి చర్చించారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లో మంగళవారం నాడు ప్రారంభమైన ఈ సదస్సులో ఇక్రిశాట డైరెక్టర్ జనరల్ డాక్టర్ డేవిడ్ బర్గ్‌విన్సన్, తెలంగాణ వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి సి పార్థసారధి, సిజిజి డైరెక్టర్ జువ్వాడి దేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 20 దేశాల వ్యవసాయ నిపుణులు, అధికారులు వారివారి దేశాల్లో వాతావరణ మార్పుపై నివేదికలను సమర్పించి దృష్టి కోణాలు, వాటి ప్రభావంపై ప్యానల్ చర్చలో పాల్గొన్నారు. శాస్తవ్రేత్తలు వ్యవసాయంపై వాతావరణ ప్రభావం పరిష్కరించడానికి మార్పుకోసం అనేక మార్పులు సూచనలు చేశారు. అల్జీరియా, బంగ్లాదేశ్, అర్జెంటీనా, కాంబోడియా, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాన్, జోర్దాన్, నైజర్, పెరు, నైజీరియా, సుడాన్, సిరియా, ట్యాంజీనియా, టునీషియా, ఉరుగ్వే, వియత్నాం, జాంబియా, జింబాబ్వే తదితర దేశాల ప్రతినిధులు నివేదికలు సమర్పించి చర్చలో పాల్గొన్నారు.