రాష్ట్రీయం

కొండంతా భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 19: వేసవి సెలవుల నేపథ్యంలో గత రెండు రోజులుగా శ్రీవారిని దర్శించుకోడానికి వచ్చిన భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో శనివారం భక్తుల సంఖ్య మరింత పెరిగింది. సాయంత్రం ఆరుగంటల వరకు 67,272 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరో 30 నుంచి 40 వేల మంది భక్తులు ఆదివారం ఉదయం లోపల స్వామివారిని దర్శించుకోడానికి వేచి ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం నుండి శనివారం మధ్యాహ్నం వరకు భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా 3.90 కోట్ల రూపాయలు శ్రీవారికి ఆదాయం లభించింది. శనివారం రద్దీ గణనీయంగా పెరగడంతో గదులు దొరకని భక్తులు ఉద్యానవనాలు, పేమెంట్‌పై విశ్రాంతి తీసుకోవడం కనిపించింది. కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. వేసవి సెలవులు, మరో వైపు వివిధ విద్యా సంస్థలకు సంబంధించిన ఫలితాలు వెల్లడి కావడం అందులో ఉత్తీర్ణులైన పిల్లల తల్లిదండ్రులు మొక్కులు తీర్చుకోడానికి కుటుంబ సమేతంగా తరలి వస్తున్నారు. ఈ క్రమంలో స్వామివారికి తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. తిరుమలలో ప్రధాన కళ్యాణ కట్టతోపాటు వివిధ ప్రాంతాల్లో మినీ కళ్యాణ కట్టలు ఏర్పాటు చేసినప్పటికీ భక్తులు తలనీలాలు సమర్పించడానికి గంటలతరబడి వేచి వుండవల్సిన పరిస్థితి ఏర్పడింది. వైకుంఠం కాంప్లక్స్ లోపల, వెలుపల స్వామిదర్శనం కోసం ఉన్న భక్తులకు అవసరమైన తాగునీరు, కాఫీ, టీ, అల్పాహారం, భోజనాల ఏర్పాటు చేశారు.

చిత్రాలు... శ్రీవారి దర్శనానికి ఉద్యాన వనాల్లో వేచి ఉన్న భక్తులు