రాష్ట్రీయం

తెలంగాణ కాంగ్రెస్‌లో కదనోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కర్నాటక రాష్ట్ర అసెంబ్లీలో శనివారం బలపరీక్షకు ముందే ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేయడంతో తెలంగాణలోని కాంగ్రెస్‌లో కదనోత్సాహం కనిపించింది. శనివారం సాయంత్రం 4 గంటలకు గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టివీలో కర్నాటక ఫలితాలను ఆసక్తిగా తిలకించారు. అక్కడ యడ్యూరప్ప రాజీనామా చేయడంతో కేరింతలు కొట్టారు. కొంత మంది కార్యకర్తలు ఉత్సాహంగా గాంధీ భవన్ ఆవరణలో బాణాసంచా పేల్చారు. ఎఐసిసి కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో మిఠాయిలు పంచి పెట్టారు.
ప్రజాస్వామ్య విజయం: జానా
ఇది ప్రజాస్వామ్య విజయం అని సిఎల్‌పి, తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు సుప్రీం కోర్టు వెంటనే చొరవ తీసుకుని ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు తగిన ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు. అక్కడ కాంగ్రెస్, జనతాదళ్ ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉంటూ, ప్రలోభాలకు లొంగకుండా, ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడడం చాలా గొప్ప విషయమని జానారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ గెలుపు ప్రజలది: పొన్నాల
పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ ఈ గెలుపు ప్రజలది, ప్రజాస్వామ్యానిది అని వ్యాఖ్యానించారు. న్యాయం, ధర్మం, సత్యం ఇంకా చట్టం నిలబడ్డాయ ని ఆయన తెలిపారు. కర్నాటక ప్రజలకు, కాంగ్రెస్, జెడిఎస్ నాయకులకు, కార్యకర్తలకు పొన్నాల శుభాకాంక్షలు చెప్పారు. ప్రజాస్వామ్య పునాదులు పెకిలించే శక్తులకు అడ్డుకట్ట పడిందన్నారు.
నియంతలా వ్యవహరించిన బీజేపీ: గీతారెడ్డి
పిఎసి చైర్మన్, మాజీ మంత్రి డాక్టర్ జె. గీతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ నియంతలా బిజెపి వ్యవహారించిందని విమర్శించారు. ఇప్పుడు సరైన బుద్ధి వచ్చిందని ఆమె అన్నారు.
చాంతాడంత జాబితా..!
ఇలాఉండగా జెడిఎస్ నేత కుమార స్వామి సోమవారం సాయంత్రం 4 గంటలకు చేయనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించే ప్రముఖుల పేర్లతో చాంతాడంత జాబితా తయారవుతున్నది. ఇందులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరి పేర్లు ఉన్నాయి.