రాష్ట్రీయం

1న హైదరాబాద్‌లో ధూంధాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్): పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అమరుల ఆకాంక్షలు నెరవేరడం లేదని, అందుకే జూన్ 1వ తేదీన తెలంగాణ కళాకారులు, ఉద్యమకారుల ఆధ్వర్యంలో అమరవీరుల ఆకాంక్ష దినోత్సవ వేడుకలను హైదరాబాద్‌లో ధూంధాంగా నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఖమ్మంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నాడు ఉద్యమ సమయంలో చెప్పిన మాటలకు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న విధానాలకు పొంతన లేదన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీన అమరవీరుల ఆకాంక్ష దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. కాగా రైతుబంధు పథకం కేవలం ఉపశమనమేనని, పోడు సాగు చేసే రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింప చేయలన్నారు. మరో వైపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని దుయ్యబట్టారు. కర్ణాటక వ్యవహారం దేశానికి గుణపాఠంలాగా మారిందని, ప్రజాస్వామ్యన్ని కాపాడుకోవటంలో సెక్యులర్ పక్షాలన్ని ఏకంకావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజవర్గాలలో సీపీఐకి గణనీయమైన ఓట్లు ఉన్నాయన్నారు. 30నియోజకవర్గాలలో 15వేలకు పైగా ఓట్లు ఉండగా మరో 40నియోజకవర్గాలలో 10వేలకు పైగా ఓట్లు ఉన్నాయని, మెజార్టీ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నామన్నారు. స్థానిక, సార్వత్రిక ఎన్నికలకు సీపీఐ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నామన్నారు. అందులో భాగంగా త్వరలోనే నియోజకవర్గాల వారీగా కమిటీలను ఏర్పాటు చేస్తామని, కలిసి వచ్చే వామపక్ష, ప్రజాతంత్ర, సామాజిక శక్తులతో కలిసి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. టిమాస్ ద్వారా ఉపయోగం లేదనే విషయాన్ని తాము గతంలోనే వెల్లడించామని పేర్కొన్నారు. అందుకే దానికి దూరంగా ఉన్నామన్నారు. అయితే తాము ప్రతిపాదించే వేదికలో చివరికైనా సీపీఎం కూడా చేరుతుందని చాడ వెంకటరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.