రాష్ట్రీయం

మళ్లీ మావోల పంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, మే 20: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. ఇటీవలి కాలంలో వరుస ఎదురుదెబ్బలతో డీలాపడిన మావోయిస్టులు అదును చూసి భీకర దాడికి పాల్పడ్డారు. పోలీసు జవాన్లను లక్ష్యంగా చేసుకొని మందుపాతర పేల్చారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో జవాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. దంతెవాడ జిల్లాలోని బచేలి దండకారణ్యంలో చోల్నార్ అటవీ ప్రాంతంలో ఇటీవల రహదారి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రహదారి పనులకు రక్షణగా బచేలి పోలీసు క్యాంప్ నుంచి ఆదివారం ఏడుగురు జవాన్లు బయలుదేరి వెళ్లారు. వీరి రాకను గమనించిన మావోయిస్టులు కిరండోల్ - చోల్నార్ ప్రాంతాల మధ్య రహదారిపై 10 అడుగుల లోతులో శక్తిమంతమైన మందుపాతరను అమర్చారు. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం రాగానే చెట్ల చాటు నుంచి మావోయిస్టులు మందుపాతరను పేల్చేశారు. పేలుడు ధాటికి
జవాన్లు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం తునాతునకలైంది. జవాన్లు చెల్లాచెదురయ్యారు. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారని బస్తర్ డీఐజీ రతన్‌లాల్ డాంగీ వెల్లడించారు. మృతుల్లో రాంకుమార్ యాదవ్, టీకేశ్వర్ ధృవ్, సాలింగ్‌రాం, విక్రమ్ యాదవ్, రాజేష్ సింగ్, వరీంద్రనాథ్ ఉన్నారు. రజ్‌వార్ అనే మరో జవాన్ ఆసుపత్రిలో మృతి చెందాడు. శక్తిమంతమైన మందుపాతర కావడంతో రహదారిపై 11 అడుగుల మేర గొయ్యి ఏర్పడింది. రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా మందుపాతర పేల్చిన అనంతరం జవాన్ల వద్ద ఉన్న రెండు ఏకే 47 రైఫిళ్లు, 2 ఏస్‌ఎల్‌ఆర్‌లు, 2 ఇన్సాస్ రైఫిళ్లు, రెండు హ్యాండ్ గ్రనైడ్లను మావోలు తీసుకెళ్లారు.
ఇదిలావుంటే ఈ నెల 22న చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ బచేలీ ప్రాంతంలో వికాస్ యాత్ర బహిరంగ సభకు హాజరు కానున్నారు. బచేలి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటన అనంతరం బస్తర్ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు బస్తర్ డీఐజీ తెలిపారు. ప్రత్యేక బలగాల సాయంతో పరిసర ప్రాంతాల్లో నక్సల్స్ కోసం కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.
చిత్రాలు..సంఘటనా స్థలి వద్ద జవాన్ల మృతదేహాలు
*పేలుడు ధాటికి ఏర్పడిన గొయ్యి