రాష్ట్రీయం

కొలిక్కివస్తున్న బదిలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలపై చర్యలు వేగవంతమయ్యాయ. నెలాఖరున బదిలీలపై నోటిఫికేషన్ విడుదల చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇకమీదట రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల బదిలీలకు శాశ్వత విధానాన్ని రూపొందిస్తోంది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా నేతృత్వంలో బదిలీల విధాన రూపకల్పనకు ఆర్థికశాఖ కార్యదర్శి శివశంకర్, సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి ఆధార్ సిన్హా సభ్యులగా కమిటీని ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారుల సంఘాలతో బదిలీల విధానం ఏవిధంగా ఉండాలనే దానిపై కమిటీ చర్చస్తుంది. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఇప్పటికే తమ ప్రతిపాదనలను కమిటీకి అందజేసింది. రెండు మూడు రోజుల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి కూడా ప్రతిపాదనలు అందనున్నాయి. అన్ని సంఘాల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాక ఈనెల 25 తర్వాత బదిలీల విధానంపై ప్రభుత్వానికి కమిటీ తన నివేదిక అందించనుంది. ఈ నెలాఖరుకు బదిలీల ప్రక్రియపై నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. జూన్ రెండో వారానికల్లా బదిలీల ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జూలైలో పంచాయతీ ఎన్నికలు జరుగనుండటంతో ఆ లోగానే బదిలీల ప్రక్రియను
పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఇలాఉండగా మరోవైపు జోన్ల ఏర్పాటుపైనా కసరత్తు కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎన్ని జోన్లు ఉండాలనే దానిపై ఉద్యోగ సంఘాలతో చర్చించి ప్రభుత్వానికి నివేదించేందుకు టీఎన్జీవోల సంఘం గౌరవాధ్యక్షుడు, స్టేట్ బ్రెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవిప్రసాద్‌కు బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే. జోన్ల విధానంపై గతంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం చేసిన సిఫారసులపై ఉద్యోగ, అధికారుల సంఘాలతో దేవిప్రసాద్ చర్చిస్తున్నారు. రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తుండగా, మంత్రివర్గ ఉప సంఘం మాత్రం నాలుగు జోన్లకు మాత్రమే సిఫారసు చేసినట్టు సమాచారం. రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించాలా? నాలుగు జోన్లుగా విభజించాలా? అనే అంశంపై ఉద్యోగ సంఘాలతో దేవిప్రసాద్ చర్చిస్తున్నారు. జోన్ల ఏర్పాటు ప్రక్రియను జూన్‌లో పూర్తి చేసి జూలైలో రాష్టప్రతి ఆమోదానికి పంపించే అవకాశం ఉంది.