రాష్ట్రీయం

సంక్షోభంలో విత్తనం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: తెలంగాణలో 2018 ఖరీఫ్ సీజన్‌కు విత్తన సంక్షోభం తప్పేలా లేదు. గత నాలుగేళ్లుగా ఖరీఫ్ సీజన్‌లో సరాసరిన కోటి ఎకరాల్లో రైతులు విత్తనాలు వేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది 1.42 కోట్ల ఎకరాల్లో పంటలు వేసేందుకు ప్రభుత్వం ‘రైతుబంధు’ పథకం కింద ఆర్థిక సాయం అందించింది. అంటే ఇంత విస్తీర్ణంలో పంటలు వేసేందుకు విత్తనాలు సరఫరా చేయాల్సిన అవసరం ఉంటుందని తెలుస్తోంది. 2018-19కి రాష్ట్రంలో రైతుల అవసరాలకు 24.20 లక్షల క్వింటాళ్ల సర్టిఫైడ్ విత్తనం అవసరమన్నది అంచనా. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ కేంద్రంలోని ‘నీతి ఆయోగ్’కు ఇందుకు సంబంధించి ఒక నివేదికను గతంలో అందించింది. ప్రభుత్వం 2018 ఖరీఫ్ సీజన్‌లో ఆరులక్షల క్వింటాళ్ల విత్తనాన్ని మాత్రమే రైతులకు సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. 1.42 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు వేసేందుకు కనీసం 36 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరమని నిపుణులు భావిస్తున్నారు. అంటే రైతుల అవసరాలకు, ప్రభుత్వం చేసే సరఫరాకు మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ పరిస్థితిలో రైతులు తమకు అవసరమైన సర్టిఫైడ్ విత్తనాల కోసం ప్రైవేట్ కంపెనీలను ఆశ్రయించక తప్పేలా లేదు. ప్రైవేట్ కంపెనీలు ఎక్కువ ధరకు విత్తనం అమ్మడం, నకిలీ విత్తనాలు పెద్ద ఎత్తున మార్కెట్లోకి రావడానికి అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. పత్తి పంట కోసం 2018 ఖరీఫ్ సీజన్‌కు విత్తనాలు దాదాపు ఒక లక్ష ప్యాకెట్లు (సుమారు 90 వేల క్వింటాళ్లు) అవసరమవుతాయి. గత ఏడాది దాదాపు 42 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు. ప్రభుత్వం
జోక్యం లేకుండా ప్రైవేట్ కంపెనీలే రైతుల అవసరానికి తగ్గట్టు బిటి-2 (బిజి-2) విత్తనాన్ని సరఫరా చేశాయి. 2017 సీజన్‌లో బిటి-2 పత్తివిత్తనంలో కాయతొలిచే పురుగును నాశనం చేసే శక్తిని కోల్పోవడంతో పత్తిపంట తీవ్రమైన సంక్షోభానికి గురైంది. దిగుబడి పూర్తిగా తగ్గింది. గత ఏడాది చవిచూసిన చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ఎవరూ బిటి-2 పత్తి వేసేందుకు ముందుకు రావడం లేదు. తీవ్రమైన సంక్షోభం ఏర్పడ్డప్పటికీ ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయం చూపలేకపోతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో వ్యవసాయ వర్శిటీ కూడా ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించలేదు.
ఇలా ఉండగా బిటి-3 పత్తి విత్తనాన్ని విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతించకపోవడంతో మోన్‌శాంటోతో సహా వివిధ కంపెనీలు బిటి-3 (బిజి-3) ని సిద్ధం చేయలేకపోయాయి. గత ఏడాది రహస్యంగా కొన్ని కంపెనీలు అందించిన బిటి-3 పత్తివిత్తనాన్ని కొంత మంది రైతులు తమ పొలాల్లో వేశారని సమాచారం అందడంతో దీనిపై ప్రభుత్వం విచారణ చేసింది. బిటి-2, బిటి-3 పత్తివిత్తనాలపై చర్చించేందుకు ఇటీవల ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో బిటి-2 పత్తివిత్తనానే్న కొన్ని సాంకేతిక విధానాల మధ్య రైతులు వేసేలా చూడాలని నిర్ణయించారని స్టేట్ సీడ్ సర్ట్ఫికేషన్ ఏజెన్సీ డైరెక్టర్ డాక్టర్ కే. కేశవులు ఆంధ్రభూమితో చెప్పారు. బిటి-2 విత్తనం అందించేందుకు పత్తివిత్తన సంస్థలు సిద్ధంగా లేవని తెలుస్తోంది. ఒక సంవత్సరానికి అవసరమైన విత్తనాన్ని సిద్ధం చేయాలంటే కనీసం రెండేళ్ల నుండే ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాల్సి ఉంటుంది. ఈ పని తెలంగాణలో జరగలేదు. ఇప్పుడు రైతులు పత్తి విత్తనం ఏది వేయాలో తేల్చుకోలేకపోతున్నారు. రైతుల ముందు ఎలాంటి ప్రత్యామ్నాయం కూడా లేదు.
2018 ఖరీఫ్ సీజన్‌కు రైతులకు అవసరమైన విత్తనాలను సరఫరా చేసే అంశాన్ని వ్యవసాయ శాఖ పర్యవేక్షిస్తోందని స్టేట్ సీడ్ సర్ట్ఫికేషన్ ఏజెన్సీ డైరెక్టర్ కేశవులు తెలిపారు. మరో పది రోజుల్లో విత్తనాలకు సంబంధించి ఉన్నతస్థాయి సమావేశం జరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు ఈ ప్రతినిధితో చెప్పారు.