రాష్ట్రీయం

సమ్మెపై సందిగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: ఆర్టీసీలో కార్మిక సమ్మెపై సందిగ్ధత కొనసాగుతోంది. గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ ఇచ్చిన సమ్మె నోటీసును సర్కారు ఖాతరు చేయకపోవడంతో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ఆలోచనలు సాగుతున్నాయ. సమ్మె చేసుకుంటే చేసుకోవచ్చంటూ సీఎం కేసీఆరే నిర్ద్వంద్వంగా తెగేసి చెప్పడంతో, తెలంగాణ మజ్దూర్ సంఘం (టీఎంయూ) ఈనెల 21 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని నోటీసు ఇచ్చింది. ఇప్పటివరకు రెండు దఫాలుగా మంత్రుల కమిటీతో సంప్రదింపులు జరిపినా ఆశించిన ప్రయోజనం దక్కలేదు. వేతన సవరణే ప్రధాన డిమాండ్‌గా కార్మికులు చెబుతున్నారు. వేతన పెంపు నష్టాల్లో సాగుతున్న సంస్థకు పెనుభారమేనన్న సీఎం వ్యాఖ్యలతో గుర్తింపు కార్మిక సంఘం అయోమయంలో పడింది. తప్పని పరిస్థితిలో తన కార్యాచరణను సోమవారం ప్రకటించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఇదిలావుంటే ప్రత్యర్ధి కార్మిక సంఘాలు ఎనిమిది కలిసి జేఏసీగా ఏర్పడి ఈ నెల 24 తర్వాత ఎప్పుడైనా సమ్మె చేస్తామంటూ నోటీసు ఇవ్వడం తెలిసిందే. ఈ దశలో రెండు సంఘాలు పెట్టిన గడువు దగ్గర పడుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఏంచేయాలనే అంశంపై మల్లగుల్లాలు మొదలయ్యాయ. ఎనిమిది సంఘాల జెఏసి మాత్రం సోమవారం రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసుకుని
కార్యాచరణ ప్రకటించనున్నారు. మంత్రుల కమిటీతో మరోసారి గుర్తింపు కార్మిక సంఘం టీఎంయూ సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. వేతన సవరణ జరిగే వరకు మధ్యంతర వెసులుబాటుగా ‘ఇంటెరమ్ రిలీఫ్’ను ప్రభుత్వం కొంచెం ఆలస్యంగానైనా ప్రకటించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఉద్యోగుల వేతన సవరణ కోసం ప్రభుత్వం అధికార కమిటీని నియమించి అధ్యయనం చేసి ఆగస్టు నాటికి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఆ కమిటీ నిబంధనల మేరకు ఆర్టీసీ కార్మికుల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకునే విధంగా టీఎంయూ ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేసే అవకాశం లేకపోలేదని సమాచారం.