రాష్ట్రీయం

ఆర్చరీలో అదుర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 20: గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన నాలుగేళ్ల ఆర్చర్ మారుతీ ఆరుష్‌రెడ్డి ప్రపంచంలోనే అరుదైన రికార్డులు సృష్టించారు. పది నెలలుగా విజయవాడలోని చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీలో ఈ చిన్నారి శిక్షణ పొందుతున్నాడు. వివిధ సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఆదివారం కేవలం 14 నిముషాల 40 సెకన్ల వ్యవధిలో 15 మీటర్ల దూరంలోని 122 సెం.మీ టార్గెట్ ఫేస్‌ను 118 బాణాలతో ఆరుష్‌రెడ్డి ఛేదించాడు. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ అంశంలో తన విలువిద్య నైపుణ్యంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, ఏషియా బుక్ ఆఫ్ రికార్డు సాధించాడు. ఆయా సంస్థల ప్రతినిధులు విశ్వరూపరాయ్ చౌదరి, ఏఏఐ జడ్జి బి శ్రావణ్‌కుమార్, ఏపీఏఏ జడ్జి డి అనిరుధ్ దుర్గేష్, శాప్ పరిశీలకుడు కోలుకొండ రాజు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, జాతీయ, అంతర్జాతీయ ఆర్చర్‌ల సమక్షంలో ఈ పోటీ ప్రదర్శన జరిగింది. ఆరుష్‌రెడ్డికి వీఎంసీ ఓల్గా ఆర్చరీ ఫీల్డ్‌లో చీఫ్ కోచ్ చెరుకూరి సత్యనారాయణ, సహాయ కోచ్‌లు నవీన్‌కుమార్, గోపీచంద్, టి రవిచంద్ర 10 నెలలుగా రోజుకు 6గంటలు చొప్పున శిక్షణ ఇచ్చారు. పోటీ అనంతరం ఆయా సంస్థల ప్రతినిధులు ఆరుష్‌రెడ్డికి బంగారు పతకాలు, రికార్డు ధ్రువపత్రాలు అందజేశారు. ఈసందర్భంగా బాలుని తల్లిదండ్రులు డాక్టర్ చెంచురెడ్డి, డాక్టర్ శాంతిశ్రీ, తాత, నాయనమ్మలు డాక్టర్ రామలింగారెడ్డి, డాక్టర్ సరస్వతి ఆరుష్‌రెడ్డిని ఆనందంతో ముద్దాడి అభినందించారు. మున్ముందు ఈ అకాడమీ ద్వారా మరెన్నో విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి పేరుతేవాలని ఆకాంక్షించారు.

చిత్రం..ఇండియా బుక్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ధ్రువపత్రాలతో బాల ఆర్చర్ ఆరుష్‌రెడ్డి