రాష్ట్రీయం

తిరుమలలో తప్పిదాలపై విచారణ జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: తిరుమలలో జరుగుతున్న తప్పిదాలపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని తిరుమల తిరుపతి దేవస్థానాల (టిటిడి) ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి సంబంధించిన విలువైన ఆభరణాలు మాయం కావడం, మైసూరు రాజులు గతంలో స్వామికి సమర్పించిన వజ్రం మాయం కావడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. భక్తులు స్వామివారికి సమర్పించిన ఆభరణాలు అన్నీ ఉన్నాయా లేదా అన్న అంశాలపై కూడా విచారణ జరగాల్సి ఉందన్నారు. తిరుమలలో జరిగిన తప్పిదాల గురించి తాను ప్రశ్నిస్తే, తనను ప్రధాన అర్చకత్వం బాధ్యతల నుండి తప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులెవరైనా శ్రీవేంకటేశ్వరస్వామి వారిపట్ల జరుగుతున్న అపచారాల గురించి ప్రశ్నించవచ్చన్నారు. స్వామివారికి నైవేద్యం తయారు చేసే ‘పోటు’లో గోడలు కూల్చడం, బండలు తవ్వడం ఎందుకో తేలాల్సి ఉందని దీక్షితులు పేర్కొన్నారు. తాను ఈ అంశంపై ఈఓకు తెలియచేస్తే నాలుగు బండలు మారుస్తున్నట్టు చెప్పారని అంతకుమించి తనకు ఏమీ తెలియదని చెప్పారని దీక్షితులు వివరించారు. 22 రోజుల పాటు పోటులో ఎలాంటి మరమ్మతులు చేశారో, ఎందుకు చేశారో తేలాల్సి ఉందన్నారు. ఈఓకు తెలియకుండా మరమ్మతులు జరుగుతాయా అంటూ ప్రశ్నించారు. స్వామివారికి చేసే సుప్రభాత సేవ, తోమాల సేవ తదితర సేవలు వేగంగా జరగాలని పూజారులపై అధికారులు వత్తిడి తెస్తున్నారని, కనీసం నైవేద్యం పెట్టేందుకు కూడా సరైన సమయం ఇవ్వడం లేదని అన్నారు. అధికారుల వత్తిడి వల్ల వివిధ సేవలు, నైవేద్యం పెట్టడాన్ని పూజారులు వేగంగా చేయాల్సి వస్తోందన్నారు. స్వామివారికి విశ్రాంతి లేకుండా ఉన్నతాధికారులు చేస్తున్నారని ఆరోపించారు.