రాష్ట్రీయం

యాదాద్రి కిటకిట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, మే 20: శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనార్థం వచ్చిన భక్తులతో యాదాద్రి కొండ ఆదివారం పోటెత్తింది. స్వామివారి దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లు, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం, ధర్మ దర్శనం, ప్రసాద విక్రయ కౌంటర్ల వద్ద భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాలాలయం, గర్భాలయంలోనికి భక్తులను అనుమతించకుండా కేవలం స్వర్ణ పుష్పార్చన చేసే భక్తులను మాత్రమే గర్భాలయంలోకి అనుమతించారు. సామాన్య భక్తులకు లఘు దర్శనం కల్పించారు. ఉదయం సుప్రభాతంతో స్వామి అమ్మవార్లను మేల్కొలిపి ఆలయ కైంకర్యాలు ప్రారంభించారు. ప్రతిష్ఠామూర్తులను ఆరాధన నిర్వహించిన పూజారులు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అభిషేకం చేయడంతోపాటు తులసీదళాలతో అర్చించి పూలతో అత్యంత సుందరంగా అలంకరించారు. కవచమూర్తులను స్వర్ణపుష్పాలతో అలంకరించి ఆరాధించారు. ఆలయ మహామండపంలో వేదపండితులు, అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని పంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. అంతకుముందు స్వామి, అమ్మవార్ల ఎదుట శ్రీసుదర్శన నారసింహ హోమం, యజ్ఞం జరిపారు. కల్యాణ మహోత్సవానికి ముందుగా స్వామి అమ్మవార్లను అలంకరించిన గజవాహనంపై సేవ ఉత్సవాన్ని నిర్వహించారు. బాలాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన అష్టోత్తర, సహస్రనామార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం స్వామి అమ్మవార్ల వెండి జోడి సేవ ఉత్సవాన్ని నిర్వహించారు. పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ అర్చకులు ఎర్రబెల్లికి ఆశీర్వచనాలు చేశారు.

చిత్రాలు..స్వామివారికి గజవాహన సేవ
*కిటకిటలాడుతున్న క్యూలైన్లు