రాష్ట్రీయం

మీరా మాకు నీతులు చేప్పేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 20: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చీల్చి టీడీపీలో కలుపుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడు నీతులు వల్లించడం విస్మయం కలిగిస్తున్నదని బీజేపీ జా తీయ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ వ్యా ఖ్యానించారు. కర్నాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కలిసి ఏర్పాటు చే యబోయే ప్రభుత్వం అనైతికం అవుతుందని దత్తాత్రేయ ఆదివా రం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. చంద్రబాబు దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయ్యారని ఆయన ఘాటైన విమర్శించా రు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరిట కాంగ్రెస్‌కు దగ్గరయ్యేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. జేడీఎస్ ఎమ్మెల్యే కుమారస్వామి ముఖ్యమంత్రిగా చేయబోయే ప్రమాణ స్వీకారానికి టీఆర్‌ఎస్ ఎందుకు హాజరుకావాలనుకుంటున్నదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాంతీయ పార్టీల తో సుస్థిర పాలన కొనసాగదన్న విషయాన్ని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత గ్రహించాలని సూచించారు. 2019 ఎన్నికల్లో బీజేపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీల సహకారం లేకపోతే కాంగ్రెస్ దేశంలో ఎప్పుడో కనుమరుగయ్యేదన్నారు.