రాష్ట్రీయం

బాబు శిక్షణ..ఎమ్మెల్యేల భక్షణ వెంకన్న ఆభరణాలకూ రక్షణ కరవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 21: అవినీతిపై చంద్రబాబు శిక్షణలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలంతా రెచ్చిపోతున్నారని వైసీపీ అధినేత, విపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జగన్ సోమవారం సాయంత్రం తాడేపల్లిగూడెంలోని మార్కెట్ సెంటర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. మొత్తం అన్ని సీట్లు గెలిపించిన పశ్చిమగోదావరి జిల్లాకు చంద్రబాబు న్యాయం చేయలేదని, అయితే రౌడీయిజం, అధికారులపై చేయిచేసుకోవడం, ఆడవాళ్లను జుట్టుపట్టుకుని ఈడ్చికొట్టడం, మట్టి, ఇసుక నుంచి దోపిడీ, కాంట్రాక్టర్ల నుండి కమిషన్లు గుంజడం అనే అంశాలపై జిల్లా ఎమ్మెల్యేలకు మాత్రం చక్కటి శిక్షణ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఒక్క పశ్చిమ గోదావరిలోనే కాకుండా రాష్ట్ర మంతా యధేచ్ఛగా
దోపిడీ జరుగుతోందని ధ్వజమెత్తారు. అధికార పార్టీ నేతలు దేన్నీ వదిలిపెట్టడం లేదని, మట్టి, ఇసుక మొదలు రాజధాని భూములు, చివరకు ఆలయాల భూములను కూడా వదిలిపెట్టడం లేదన్నారు. చివరికి తిరుపతి వేంకటేశ్వరుని ఆలయంలో ఆభరణాలను కూడా వదిలిపెట్టడం లేదని ధ్వజమెత్తారు. పైస్థాయిలో చంద్రబాబు, గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీలు ఆ పనులే చేస్తున్నాయని ఆరోపించారు. తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే కాని ఎమ్మెల్యే అయిన జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఇసుక, మట్టి దోపిడీ మాత్రమే కాకుండా పేకాటను కూడా జోరుగా ఆడిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల ఇబ్బంది లేకుండా చూడటానికి నెలకు రూ.30 లక్షలు ఆయనకు కప్పం కడితే చాలని ఆరోపించారు. దీన్ని అడ్డుకున్న ఒక సీఐని రోజుల వ్యవధిలో వీఆర్‌కు పంపేశారన్నారు. అన్నింటికీ మించి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయులు కదిలే శవాలంటూ వ్యాఖ్యానించడం దారుణమన్నారు. పశ్చిమ కలెక్టర్ చంద్రబాబుకు చాలా క్లోజ్‌గా వ్యవహరిస్తున్నారని, అందుకే ఆయనకు నాలుగేళ్లైనా బదిలీ లేదన్నారు. జిల్లాలో అవినీతి పేట్రేగిపోతుంటే చంద్రబాబు జిల్లాకు వచ్చిన ప్రతీ సారి కలెక్టర్ భుజంపై చేయివేసి బ్రహ్మాండంగా చేస్తున్నారంటూ కితాబునిస్తున్నారని ఆక్షేపించారు.
ఇక చంద్రబాబు ప్రతీ మూడవ సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శన అంటూ వచ్చి, తనకు రావాల్సిన కలెక్షన్లు లాక్కుని వెళ్లిపోతున్నారని జగన్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, ఇష్టానుసారం అంచనాలు పెంచేస్తూ నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగిస్తున్నారన్నారు. చివరకు రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు కూడా సబ్-కాంట్రాక్టరుగా మారిపోయారని ధ్వజమెత్తారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా దాదాపు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి వుండగా బాబు నిర్వాకం వలన పిల్లకాలువల పనులు పూర్తికాకపోవడంతో కేవలం 60 వేల ఎకరాలకు మాత్రమే నీరు అందుతోందన్నారు. పంటలు పండించే రైతులకు ఏ ఒక్కరికి కూడా మద్దతు ధర లభించడం లేదని పేర్కొన్నారు. దీనికి కారణం చంద్రబాబు స్వయంగా దళారీ అవతారం ఎత్తడమేనని విమర్శించారు. తన సొంత సంస్థ హెరిటేజ్ కోసం ఆయన దళారీగా మారిపోయారని ఆరోపించారు. తాడేపల్లిగూడెంలో పేదలకు ప్లాట్లు కట్టించి ఇస్తామని చెబుతున్న చంద్రబాబు దానిలోనూ అవినీతికి పాల్పడుతున్నారని, తాము అధికారంలోకి వస్తే లబ్ధిదారులు చెల్లించాల్సిన రుణ మొత్తాన్ని మాఫీ చేస్తామని ప్రకటించారు. కాపులకు న్యాయం చేస్తామని చెప్పిన చంద్రబాబు వారిని మోసం చేశారని, తాము అధికారంలోకి వస్తే కాపులకు ప్రస్తుతం జరిగిన మేలుకు రెండింతలు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన తాము అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమానికి అమలు చేసే నవరత్న పధకాల గురించి సవివరంగా వివరించారు. ప్రజలు నాలుగేళ్ల పరిపాలనను అధ్యయనం చేసుకుని తమ మనస్సాక్షికి అనుగుణంగా రానున్న ఎన్నికల్లో ఓటు వేయాలని, మోసం చేసి అబద్దాలు చెప్పిన వారిని బంగాళాఖాతంలో కలిపివేయాలని ఆయన పిలుపునిచ్చారు.