ఆంధ్రప్రదేశ్‌

బాబు జమానాలో అన్నీ మాఫియాలే.. రోజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంఖవరం: కాల్‌మనీ, కల్తీమద్యం, ఇసుక మాఫియా ఇదే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం సాధించిన అభివృద్ధి అని వైసిపి ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరం సత్యదేవుని ఆలయంలో గురువారం రోజా, సెల్వమణి దంపతులు పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ చెబుతున్న గారడీ మాటలు వింటుంటే సిగ్గువేస్తోందన్నారు. తమ నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఛరిష్మా కలిగిన నాయకుడే కాక, రాష్ట్ర ప్రజలకు ఆయనపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేసి పార్టీ మారేందుకు కుట్ర పన్నుతోందన్నారు. ఎంతమంది వీడినా తమ పార్టీకి నష్టం లేదన్నారు. టిడిపికి దమ్ముంటే వారు లాక్కున్న వైసిపి ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి గెలుపించుకోవాలని సవాల్‌చేశారు.
రూ. 3 కోట్ల ఎర్రచందనం పట్టివేత
రైల్వేకోడూరు, ఫిబ్రవరి 25: కడప జిల్లా రైల్వేకోడూరు మండలంలోని కుక్కలదొడ్డి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో రవాణాకు సిద్ధంగా ఉన్న సుమారు రూ. 3 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలను తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులతో పాటు బాలుపల్లె అటవీ అధికారులు, సిబ్బంది మూకుమ్మడిగా దాడులు నిర్వహించి ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. తమను చూసి స్మగ్లర్లు అటవీ ప్రాంతంలోకి పరారయ్యారని, వారి కోసం గాలిస్తున్నామని అటవీ అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సుమారు వంద ఎర్రచందనం దుంగలను తమిళనాడుకు చెందిన గుర్తు తెలియని కూలీలు, స్మగ్లర్లు శేషాచలంలో నరికి రవాణాకు సిద్ధం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్, అటవీ అధికారులు మెరుపుదాడి చేయడంతో వారు పరారయ్యారు. మరోవైపు సమాచారం తెలుసుకుని టాస్క్ఫోర్స్ డిఐజి కాంతారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఆన్‌లైన్లో వివాహాల రిజిస్ట్రేషన్
తిరుమల, ఫిబ్రవరి 25 : టిటిడి ఆధ్వర్యంలో తిరుమల్లో వివాహాలు చేసుకోదలచుకున్న వధూవరులకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి తిరుపతికి వచ్చే అవసరం లేకుండా ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్ చేసే సౌకర్యం కల్పిస్తామని టిటిడి ఇవో డాక్టర్ డి సాంబశివరావు తెలిపారు. తిరుమల్లోని గోగర్భం రోడ్డులో ఉన్న టిటిడి కల్యాణ వేదికలో వివాహం చేసుకుంటున్న నూతన వధూవరులను గురువారం టిటిడి ఇవో డి సాంబశివరావు దంపతులు ఆశీర్వదించి, శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తిరుమల్లో టిటిడి ఆధ్వర్యంలో ఉన్న కల్యాణ వేదికలో కాని, కాటేజీలో కాని వివాహం చేసుకోదలచుకున్నవారు స్వయంగా తిరుపతికి వచ్చి ముందస్తుగా రిజర్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. తద్వారా అనేక వ్యయప్రయాసలకు వధూవరుల కుటుంబసభ్యులు ఎదుర్కోవాల్సి వచ్చేదన్నారు.

పవిత్ర నదుల్లో
టిటిడి చక్రస్నానాలు
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, ఫిబ్రవరి 25: హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా మార్చి 1 నుంచి 9వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఉన్న పవిత్ర నదుల్లో చక్రస్నానాలు నిర్వహించేందుకు టిటిడి ఏర్పాట్లు చేపడుతోంది. పవిత్రమాఘమాసం విశిష్టతను, సూర్యగ్రహణం, నదీస్నానం ప్రాధాన్యతను తెలియజేసేందుకు టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టింది. మార్చి 1న విజయవాడలోని కృష్ణానదిలో ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య, 2న బాసర వద్ద గోదావరి నదిలో ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 12 గంటల మధ్య, 5న వారణాసిలోని గంగానదిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య, 6న అలహాబాదులోని త్రివేణి సంగమం వద్ద ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య, మార్చి 9న కురుక్షేత్రంలో చక్రస్నానాన్ని టిటిడి నిర్వహించనుంది.