రాష్ట్రీయం

త్వరలో హాయ్ చంద్రన్న యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 21: ప్రజా సంతృప్తి 90 శాతానికి పెంచేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా హాయ్ చంద్రన్న యాప్‌ను త్వరలో అందుబాటులోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుంది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల సంతృప్తి స్థాయిని పెంచేందుకు ఇప్పటికే రియల్ టైమ్ గవర్నెన్సు ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం 72 శాతం మేర ప్రజల సంతృప్తి ఉండగా, దీనిని మే నెలలో 78 శాతానికి చేయాలని ఇప్పటికే అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేశారు. ప్రజల్లో సంతృప్తి స్థాయిని 90 శాతానికి పెంచేందుకు వీలుగా మరో యాప్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ముఖ్యంగా సాధికార మిత్రలకు, మహిళలకు ఈ యాప్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు ఇటీవల జరిగిన సాధికార మిత్రల సమావేశంలో ముఖ్యమంత్రి వెల్లడించారు.