రాష్ట్రీయం

ప్రియమైన బీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*స్ట్రాంగ్ బీరుపై రూ. 20 పెరుగుదల *ఖజానాకు రూ. 300 కోట్ల ఆదాయం
హైదరాబాద్, మే 22: వేసవి తాపం నుంచి సేదతీరడానికి మద్యం ప్రియులు బీర్లకు ఎగబడటంతో ఇదే అదునుగా రాష్ట్ర ప్రభుత్వం వాటి ధరలను పెంచేసింది. పెరిగిన ధరలు మంగళవారం నుంచే అమలులోకి వచ్చాయి. లైట్ బీరుపై రూ. 10, స్ట్రాంగ్ బీరుపై రూ. 20 పెంచుతూ ఆబ్కారి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన బీర్ల ధరల వల్ల నెలకు రూ. 25 కోట్లు ఏడాదికి రూ. 300 కోట్ల ఆదాయం పెరుగుతుందని అంచన వేస్తున్నట్టు ఆబ్కారి శాఖ కమిషనర్ సోమేష్‌కుమార్ తెలిపారు. అయితే పెంచిన బీర్ల ధరలు ఇప్పటికే షాపుల్లో ఉన్న బీర్లకు వర్తించదని ఆయన స్పష్టం చేసారు. మంగళవారం నుంచి మద్యం డిపోల నుంచి కొనుగోలు చేసిన బీర్ల అమ్మకాలకు మాత్రమే పెంచిన ధర వర్తిస్తుందన్నారు. మద్యం షాపుల్లో ఇప్పటికే స్టాక్ ఉన్న బీర్లను పాత ధరలకే విక్రయించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. పాత, కొత్త స్టాక్ బీర్లకు వేర్వేరు ధరల ప్రకారం అమ్ముతున్నారో? లేదో నిఘా పెట్టాల్సిందిగా సంబంధిత అధికారులను సోమేష్‌కుమార్ ఆదేశించారు.