ఆంధ్రప్రదేశ్‌

దమ్ముంటే రాజీనామా చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు దమ్ము, ధైర్యం ఉంటే టిడిపిలో చేర్చుకున్న తమ పార్టీ వారిని రాజీనామా చేయించి ప్రజాతీర్పు కోరాలని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబు తనయుడు చినబాబు కడపలో మకాం వేసి తమ పార్టీ నేతలను, ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కడప జిల్లాలో గురువారం విస్తృతంగా పర్యటించిన జగన్...గతానికి భిన్నంగా పార్టీ ద్వితీయ, తృతీయశ్రేణి నేతలతో సైతం సమావేశమై వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. అనంతరం కడపలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌పై దుమ్మెత్తిపోశారు. గతంలో కాంగ్రెస్ నుంచి వైకాపాలోకి వచ్చిన 18మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి గెలుపొందామని గుర్తుచేశారు. 2014లో తమ పార్టీ నుంచి 67 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారని, చంద్రబాబుకు నైతికవిలువలు ఉంటే పార్టీలో చేర్చుకున్న వారిచేత రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని అన్నారు. తమ పార్టీ నుంచి వెళ్లిన ఐదుగురు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి, సంతలో పశువుల్లా కొనుగోలు చేశారని అంటూ వారు పార్టీ నుంచి వెళ్లినంత మాత్రానా వైఎస్సార్ కాంగ్రెస్‌కు వచ్చే నష్టమేమి లేదని అన్నారు. టిడిపిలోకి వెళ్లిన వైకాపా నేతల స్థానంలో ప్రత్యామ్నాయంగా బలమైన నాయకులను ఆయా నియోజకవర్గాల్లో సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఏడాదిలోపు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తమ పార్టీలోకి అనేక మంది టిడిపి ఎమ్మెల్యేలు వస్తారని, వారిచేత రాజీనామా చేయించి ప్రజాతీర్పు కోరతామని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో చంద్రబాబుపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని, ప్రజల్లోకి వెళ్లే ధైర్యంలేక తమ గొంతునొక్కేందుకే కుతంత్రాలు పన్నుతున్నారని ఆరోపించారు. పట్టిసీమ నుంచి పోలవరం వరకు ఆయా ప్రాజెక్టుల నిర్మాణాల్లో సంపాదించిన అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను, కీలక నేతలను కొనుగోలు చేసేందుకు లోకేష్ కడపలో మకాం వేసి విశ్వప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బాబుకు నిజాయితీ ఉంటే పార్టీ ఫిరాయింపులపై తెలంగాణతోపాటు ఆంధ్రాలో పార్టీలు మారిన వారికి లీగల్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కడప పెద్ద దర్గాను దర్శించుకున్న వైకాపా అధినేత జగన్